»   » ‘బాహుబలి' : తప్పు జరిగింది..సరి చేస్తామన్న సాబు శిరిల్

‘బాహుబలి' : తప్పు జరిగింది..సరి చేస్తామన్న సాబు శిరిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాకు పని చేసిన మరో ఆర్ట్ డైరెక్టర్ మను జగద్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి, బాహుబలి టీం తనను మోసం చేసినట్లు ఆయన ఫీలవుతున్నారు. తనకు కనీసం టైటిల్ క్రెడిట్ ఇవ్వక పోవడంపై ఆవేదన చెందుతున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ వివరణ ఇచ్చారు.

సాబు శిరిల్ మాట్లాడుతూ..."మను టీమ్ తో కలిసి ఏడు నెలలు పనిచేసాడు. అలాగే మాకు మరో ఆర్ట్ డైరక్టర్ అనీల్ జాదవ్ కూడా ఉన్నారు. అయితే మను ని క్రెడిట్స్ నుంచి తొలిగించటం మాత్రం ఓ పొరపాటు. ఇలాంటి విషయాలన్నీ డైరక్షన్ డిపార్టమెంట్ చూసుకుంటూ ఉంటుంది. తప్పనిసరిగా త్వరలో రెక్టిఫై చేస్తాను ." అన్నారు.


ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మీద, బాహుబలి టీం మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సినిమా సూపర్ అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనితీరు అద్భుతం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Baahubali: Sabu Cyril calls it an Error!

బాహుబలి సినిమాలో విజువల్స్ అంత గొప్పగా వచ్చాయంటే అందుకు కారణం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్లు వేసిన స్కెచ్చులే. ఆ స్కెచ్చులకు విజువల్ ఎపెక్ట్స్ జోడించి తెరపై అద్భుతాలను చూపించారు. సినిమా విడుదలకు ముందు సదరు స్కెచ్చులు ఇంటర్నెట్లో అందరినీ ఆశ్యర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.


బాహుబలి సినిమాకు అసలైన ఆర్ట్ డైరెక్టర్ తానేనని, బాహుబలి సినిమా కోసం వేసిన స్కెచ్చుల్లో అధిక శాతం తాను వేసినవే అని, సాబు సిరిల్ కేవలం ఆర్ట్ డిపార్టుమెంట్‌ను కంట్రోల్ చేసే బాధ్యలు చూసుకున్నారు. సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కనీసం నాకు టైటిల్ క్రెడిట్స్ కూడా ఇవ్వడపోవడం దారుణం. నేనే మోసపోయాను అంటూ మను జగధ్ వాపోయినట్లు సమాచారం. మరి ఇతని వ్యాఖ్యలపై రాజమౌళి ఎల స్పందిస్తారో చూడాలి.

English summary
Sabu Cyril explains, “Manu worked with the team for seven months. We had another art director Anil Jadhav as well in the team. Manu’s omission from the credits was an error. These things are taken care of by the director’s department and I am sure this will be rectified soon.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu