»   » ప్రభాస్ షాకింగ్ లుక్... సోషల్ మీడియాలో వైరల్!

ప్రభాస్ షాకింగ్ లుక్... సోషల్ మీడియాలో వైరల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి స్టార్ ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచిన ప్రభాస్.... ఇపుడు 'సాహో' సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు.

బాహుబలితో పోలిస్తే బాగా బరువు తగ్గడంతో పాటు.... హెయిర్‌స్టైల్ కూడా మార్చేశాడు. ప్రభాస్ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్‌ హకిమ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఆలిమ్.. ప్ర‌భాస్‌ లుక్ పూర్తిగా మార్చేసాడు. అతడి న్యూలుక్ ఫోటో సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు.


లుక్ అదిరింది

బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ క‌నిపిస్తోన్న ఈ కొత్త లుక్‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్రభాస్ లుక్ సూపర్బ్ గా ఉందని అంటున్నారు అభిమానులు.


సాహో

సాహో

ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.


భారీ డిమాండ్

భారీ డిమాండ్

సాహో సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ సినిమాలకు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ మార్కెట్లలో కూడా డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఇపుడు ప్రభాస్ సినిమా అనగానే ఈరోస్ లాంటి పెద్ద సినీ నిర్మాణ సంస్థలు వందల కోట్లు గుమ్మరించడానికి సిద్ధపడుతున్నాయి.


అంచనాలు భారీగానే

అంచనాలు భారీగానే

ఇప్పటికే విడుదలైన ‘సాహో' టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. బాహుబలి-2 సినిమాతో పాటు ఈ టీజర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా బాగా పెరిగింది. యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్లో కలిపి ఈ టీజర్ కు కోటిన్నరకు పైగా హిట్స్ వచ్చాయంటే సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.English summary
Hakim Aalim, the top most hair stylist in Bollywood, seems to have done his magic on Baahubali star Prabhas by chopping off his long tresses, trimming his bread and giving him a complete stylish look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu