»   » బాహుబలి హీరోను ఇకపై ‘సాహో’ ప్రభాస్ అంటారు!

బాహుబలి హీరోను ఇకపై ‘సాహో’ ప్రభాస్ అంటారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొన్నేళ్లుగా బాహుబలి ప్రాజెక్టులకే పరిమితమైన ప్రభాస్ ఆ సినిమా పూర్తి కావడంతో ఇటీవలే మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకుంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయాడు. తెలుగు, తమిళంతో పాటు హిందీ పరిశ్రమలో కూడా ప్రభాస్ బాగా పాపులర్ అయ్యాడు. ప్రభాస్ ఇమేజ్ కు తగిన విధంగా ఈ సినిమాను నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు సుజీత్

సాహో ప్రభాస్

సాహో ప్రభాస్

కాగా...ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్‌ ‘సాహో' అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్‌ చేయించింది. ఇది ప్రభాస్‌, సుజీత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసమే అనే ప్రచారం జరుగుతోంది.

బాహుబలి-ది కంక్లూజన్ తో పాటు సాహో

బాహుబలి-ది కంక్లూజన్ తో పాటు సాహో

బాహుబలి-ది కంక్లూజన్ ఈ నెల 28న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటే ‘సాహో' ఫస్ట్ లుక్. టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేయడం వల్ల ‘సాహో'కు దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

150 కోట్ల బడ్జెట్?

150 కోట్ల బడ్జెట్?

యూవి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం దాదాపు రూ. 150 కోట్ల తో తెలుగు, తమిళం, హిందీల్లో ఒకే సారి చిత్రకరిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలోనే ఈ చిత్రం ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు చేతుల మీదుగా ప్రారంభం అయింది.

 అందుకే భారీగా

అందుకే భారీగా

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ఇపుడు ఆయన సినిమాలకు తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే సినిమాకు బడ్జెట్ ఎక్కువైనా మూడు బాషల్లో తీస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో ఇది 19వ సినిమా. రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నపుడు అందుకు తగిన విధంగానే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. నిర్మాతలు అవన్నీ బేరీజు వేసుకుని మరీ ఇంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Baahubali Prabhas Next Movie will be titled as “Saaho” and the director will be Sujeeth Singh Shooting is already started and the Prabhas will be the role as a cop in this Trilingual Project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu