»   » చూసారా: 'బాహుబలి' వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్ వీడియో

చూసారా: 'బాహుబలి' వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్ లైన్ మార్కెట్ సంస్థలు, ప్రొడక్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లతో వినియోగదారులు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. కొందరు సినిమా వాళ్లు తమ చిత్రం ప్రమోషన్స్ కు సైతం వాలెంటైన్ డే ని వాడుకోవాలని ఫిక్సై ఇప్పటికే ఫస్ట్ లుక్ లు, స్పెషల్ టీజర్స్ విడుదల చేస్తున్నారు.

Baahubali team Idea for Valentine's Day Cards

ఇదే కోవలో ఎప్పటికప్పుడు కొత్త తరహా ప్రచారానికి తెర తీసే బాహుబలి టీమ్ సైతం ఓ కొత్త స్ట్రాటజీని మొదలెట్టింది. ఈ సారి తమ చిత్రం ప్రమోషన్ కోసం లవర్స్ ను టార్గెట్ చేసింది బాహుబలి. రొటీన్ గా పువ్వులు, లవ్ సింబల్స్ తో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి బోర్ కొట్టిందా... అయితే వెరైటీగా బాహుబలి గ్రీటింగ్ ఇవ్వండి అంటూ ముందుకు వచ్చింది సినిమా యూనిట్.బాహుబలిలో ప్రభాస్, అనుష్కను ఎంతగా ప్రేమిస్తాడో.. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని తమ గ్రీటింగ్స్ ద్వారా చెప్పండి అంటూ ఊరిస్తోంది. ఆ గ్రీటింగ్స్ ఎలా తయారుచేయాలి... ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి... ఎలా ప్రజెంట్ చేయాలో తెలుపుతూ ఓ డెమో వీడియోను కూడా పోస్ట్ చేసింది.


రాజమౌళి సృష్టించిన బాహుబలి సిరీస్ లో అమరేంద్ర బాహుబలి, దేవసేన పాత్రలు గొప్ప ప్రేమకు చిహ్నాలు. రాబోయే రెండవ భాగమంతా వీరి ప్రేమ కథ మీదే నడవనుంది. అందుకే బాహుబలి టీమ్ ఈ మధ్య విడుదల చేసిన అమరేంద్ర బాహుబలి, దేవసేనల పోస్టర్ తో గ్రీటింగ్ కార్డు తయారు చేసారు.


Baahubali team Idea for Valentine's Day Cards

అందులో ఒక రొమాంటిక్ మెసేజ్ ను సైతం పొందుపరిచి అందమైన వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డును తయారు చేశారు. దాన్ని బాహుబలి బ్లాగ్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించి ప్రేమికులకు సహాయపడుతున్నారు. కావాలంటే మీరూ ట్రై చేయండి....


English summary
Now, with Valentines Day just around the corner, you’re probably thinking about what to gift your special someone… Baahubali team have a surprise for you and your valentine!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu