»   » కట్టప్పకు బర్తడే విషెష్ తెలిపిన బాహుబలి

కట్టప్పకు బర్తడే విషెష్ తెలిపిన బాహుబలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి' చిత్రంలో కట్టప్ప పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు సత్యరాజ్‌ పుట్టినరోజు నేడు.

kattappa1

ఈ సందర్భంగా 'బాహుబలి' చిత్ర యూనిట్ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబలి' విడుదలైన రోజు నుంచి ఒకటే ప్రశ్న నెట్ జనులను, సామాన్యులను ఆలోచనలో పడేస్తోంది. అది మరేదో కాదు... ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈవిషయమై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నెట్ జనులు జోకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో హల్‌చల్ చేస్తోంది. దీనిని ‘క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా చెప్తూ దానికి తమకు నచ్చిన సమాధానాలతోపాటు ఫోటోలను కూడా పెడుతున్నారు.బాహుబలిని కట్టప్ప ఎందుకు హతమార్చాడు.. భళ్లాలదేవ ఎలా రాజయ్యాడు.. శివగామి అందుకు సహకరించిందా.. దేవసేనను సంకేల్లతో ఎందుకు బంధించారు.. తండ్రి గురించి తెలుసుకున్న శివుడు తర్వాత ఏం చేస్తాడు.. అవంతికకు దేవసేనకు సంబంధం ఏమిటి.. ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానంగా బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ రానుంది. బాహుబలి సినిమా చివర్లో ‘బాహుబలి'ని నేనే చంపానని కట్టప్ప చెప్పటమే దీనికి కీలకం అయ్యింది. సినిమా ఘన విజయం సాధించటంతో జనం అందరూ దీనిపై చర్చ మొదలెట్టారు .


Wishing Sathyaraj sir a very happy birthday :)


Posted by Ramya Krishnan on3 October 2015

సినిమా ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి - 2'. ముఖ్యంగా కట్టప్ప... బాహుబలిని ఎందుకు చంపాడో కంక్లూజన్ దొరుకుతుందని,రకరకాల స్పెక్యులేషన్స్ తో వెయిట్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.


English summary
Sathyaraj is an Indian film actor and media personality who has predominantly appeared in Tamil films. Satya Raj started his career in villainous roles and later played lead roles. He has acted in over 200 films, which include a few Telugu, Malayalam, Hindi and Kannada films as well.
Please Wait while comments are loading...