»   » బాహుబలి2 కోసం నాని.. దిమ్మతిరిగేలా రైట్స్ అమ్మకం.. తెలియని విశేషాలు ఎన్నో..

బాహుబలి2 కోసం నాని.. దిమ్మతిరిగేలా రైట్స్ అమ్మకం.. తెలియని విశేషాలు ఎన్నో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విశేషాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బాహుబలి ది కన్‌క్లూజన్‌కు చెందిన అమెరికా, కెనడా పంపిణీ హక్కులు రూ.45 కోట్లకు అమ్ముడుపోయాయి. ఓ తెలుగు సినిమాకు చెందిన హక్కులు ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదో రికార్డు. ఈ పంపిణీ హక్కులు తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలకు కలిపి అమ్మినట్టు తెలుస్తున్నది.

వసూళ్లు 100 కోట్లు రావాలి

వసూళ్లు 100 కోట్లు రావాలి

బాహుబలి2 చిత్రం కోసం భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన వారికి లాభాలు రావాలంటే కనీసం రూ.100 కోట్లు వసూలు చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు నష్టాల బారిన పడకుండా ఉంటారు. అయితే అమెరికా, కెనడాలో భారతీయ సినిమా వసూలు చేసింది దాదాపు రూ.86.5 కోట్లు మాత్రమే. ఈ రెండు దేశాల్లో అత్యధికంగా వసూలు చేసిన భారతీయ చిత్రంగా దంగల్ నిలిచింది.

130 కోట్ల కలెక్షన్లు అంచనా

130 కోట్ల కలెక్షన్లు అంచనా

రిలీజ్‌కు ముందే సంచలనాలకు వేదికవుతున్న బాహుబలి అమెరికా, కెనడాల్లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశముందనే అభిప్రాయంతో పంపిణీదారులు ఉన్నారు. రెండు దేశాల్లో అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 130 కోట్లు వసూలు చేస్తుందనే ధీమాతో వారు ఉన్నట్టు తెలుస్తున్నది.

బాహుబలి2‌లో నాని

బాహుబలి2‌లో నాని

ఇక ఇప్పటివరకు బాహుబలి టీంలో ఎదో ఒకరూపంలో భాగస్వామ్యమయితే బాగుండనే కోరికతో ఉన్న హీరో నానికి తీపి కబురు అందింది. మార్చి 26న జరిగే ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు నాని యాంకర్‌గా వ్యవహరించనున్నాడట. యాంకర్‌గా ఉండాలని స్వయంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆహ్వానించడంతో నాని ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ఫంక్షన్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన మాహిష్మతి సెట్ వేదికగా నిర్వహించడానికి జక్కన్న ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ట్రైలర్ కోసం స్టోరీ బోర్డుల

ట్రైలర్ కోసం స్టోరీ బోర్డుల

బాహుబలి2 ట్రైలర్ విడుదలై భారతీయ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. అద్భుతంగా ట్రైలర్‌ను రూపొందించడం వెనుక భారీ కసరత్తే జరిగింది. సాధారణంగా సినిమాల కోసం స్టోరీబోర్డులు వేస్తారు. కానీ తొలిసారి ట్రైలర్ కోసం స్టోరీబోర్డు వేయడం ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి.

ప్రత్యేకంగా స్క్రిప్టు

ప్రత్యేకంగా స్క్రిప్టు

ట్రైలర్ బ్రహ్మాండంగా రావడానికి పక్కాగా స్క్రిప్ట్ రాసుకొన్నారట. రాజమౌళి తనయుడు కార్తీ, ట్రైలర్లు రూపొందించడంలో ఎక్స్‌పర్ట్ అయిన వంశీ అట్లూరి దాదాపు 24 ట్రైలర్ వర్షన్లు రూపొందించారట. ప్రస్తుతం ప్రేక్షకులు చూస్తున్న వెర్షన్ 25వది.

ఆరు రోజుల శ్రమే ట్రైలర్..

ఆరు రోజుల శ్రమే ట్రైలర్..

బాహుబలి ట్రైలర్ రూపకల్పన కోసం దాదాపు ఆరు రోజులు రేయింబవళ్లు కష్టపడ్డారట. చివరికి రెండు వెర్షన్లు రాజమౌళి అనుమతి కోసం పంపించారట. చివరకు ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌కు ఆమోద ముద్ర పడిందట. రెండో ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం లేదట.

ఇక పాటల టీజర్లు

ఇక పాటల టీజర్లు

ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ వచ్చే అవకాశం లేదట. ఇక నుంచి పాటలకు సంబంధించిన ట్రైలర్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. పది సెకన్ల నిడివి ఉండే ఒక్కో పాటను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ట్రైలర్‌ వచ్చిన స్పందనే పాటల టీజర్లకు మంచి స్పందనే వచ్చే అవకాశముందనే మాట వినిపిస్తున్నది.

ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధం

ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధం

బాహుబలి విడుదల అనంతరం రెండేళ్ల తర్వాత బాహుబలి2 ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు.

English summary
Baahubali: The Conclusion US and Canada distribution rights sold for fancy amount. Distributor who has spent a huge amount on the distribution rights of the Baahubali2 is pretty confident that it would make Rs.130 crores from all the languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu