»   » ‘బాహుబలి’ ట్రైలర్ హైదరాబాదీ స్టైల్ సూపర్బ్... (వీడియో)

‘బాహుబలి’ ట్రైలర్ హైదరాబాదీ స్టైల్ సూపర్బ్... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం యావత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.... బాహుబలి ట్రైలర్ విడుదలైనప్పటి నుండి పలు రీమిక్స్ ట్రైలర్లు కూడా యూట్యూబులో హల్ చల్ చేస్తున్నాయి. అవతార్ రీమిక్స్ బాహుబలి ట్రైలర్ తో పాటు, బాలయ్య వెర్షన్ బాహుబలి ట్రైలర్ కూడా నెట్లో హడావుడి చేసింది. ఇటీవల సంపూర్ణేష్ బాబు వెర్షన్ ‘బాహుబలి' ట్రైలర్ కూడా విడుదలైంది.


Baahubali Trailer - Hyderabadi Style

ఇప్పటి వరకు వచ్చిన ‘బాహుబలి' రీమిక్స్ ట్రైలర్లను తలదన్నేలా తాజాగా ‘బాహుబలి-హైదరాబాదీ స్టైల్' ట్రైలర్ వచ్చింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.బాహుబలి చిత్రాన్ని జూలై 10న తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Watch: This is the Trailer Remix of Baahubali in Hyderabadi Style.
Please Wait while comments are loading...