నిజమా?: 'బాహుబలి' ఆడియో వెన్యూ మార్పు...కారణం ఆయనే
హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా పాటల్ని ఈ నెల 13న ,తిరుపతిలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మార్పుకు కారణం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గారు అని తెలుస్తోంది. ఆయన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్దానం బోర్డ్ మెంబర్ అవటం వల్లనే ఈ మార్పు కు కారణం అని చెప్పుకుంటున్నారు. రాఘవేంద్రరావు గారు బాహుబలి చిత్రానికి సమర్పుడు. ఈ ఆడియో ఈవింట్ ని యువ మీడియా వారు ఆర్గనైజ్ చేస్తున్నారు.
ఇక బాహుబలి టీమ్ అఫీషియల్ గా ఈ వార్తను ఖరారు చేస్తూ ట్వీట్ చేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మైదానంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్టర్‌లో తెలిపింది. మీరూ ఆ ట్వీటన్ ని చూడండి.
ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











