»   » ‘బాహుబలి’...చాటున పొంచి ఉన్న ప్రమాదం!

‘బాహుబలి’...చాటున పొంచి ఉన్న ప్రమాదం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఇండియాలో, ముఖ్యంగా తెలుగునాట ‘బాహుబలి' గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఆ సినిమా ఇంకా చూడలేదంటే షేమ్ ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి క్రియేట్ చేసారు దర్శక నిర్మాతలు. ఫలితంగా ప్రతి ఒక్కరూ ‘బాహుబలి' సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి నిర్మాతలకు వందల కోట్ల కలెక్షన్లు రావడంతో లాభాల్లో మునిగి తేలుతున్నారు.

‘బాహుబలి' సినిమాపై ఏర్పడ్డ క్రేజ్‌ను అంశాన్ని కొందరు హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బాహుబలి ముసుగులో మీ వ్యక్తిగత కంప్యూటర్లలోకి వైరస్ జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తున్నపుడు ఎక్కడైనా ‘క్లిక్ హియర్ టు డౌన్ లోడ్ బాహుబలి మూవీ' అని కనిపిస్తే అస్సలు క్లిక్ చేయకండి. ఒక వేళ అందులో ఏముందో అని క్లిక్ చేస్తే మాత్రం మీ కంప్యూటర్లలోకి మాల్వేర్ చొరబడి కంప్యూటర్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది.


‘బాహుబలి' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ. 450 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో దీన్ని మించిన సినిమా లేదనే చెప్పాలి. ఇండియన్ సినిమా చరిత్రలో ఈచిత్రం టాప్ 5 సినిమాల్లో చోటు దక్కించుకుంది.


Baahubali Virus crashing systems

'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ముంబై మీడియా ఓ వార్తను ప్రచారం చేస్తోంది. హిందీ వెర్షన్ ని ప్రమోట్ చేసిన కరుణ్ జోహార్ ఈ సెకండ్ పార్ట్ విషయంలో రాజమౌళి పై చాలా ప్రెజర్ తెస్తున్నారని.


ఇంతకీ ఏంటా ప్రెజర్ అంటే...నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి...సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ని తీసుకోమని చెప్తునానారట. అంతేకాదు...రాజమౌళి ఏ ఆర్టిస్టులను అయితే అడుగుతారో వారిని ఖచ్చితంగా తీసుకువస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రాజమౌళి ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎంతవరకూ నార్త్ ఫేస్ లు మనకు ఇక్కడ సౌత్ లో వర్కవుట్ అవుతారనేది కూడా డిస్కస్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

English summary
he mischief mongers have used Baahubali as a lure to inject malware to your systems. So if you got a mail that has a link saying ' Click here to download Baahubali movie,' we say please do not click.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu