twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' యుద్ధం ఈ రోజు నుంచే...

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రభాస్‌, అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరు 23 నుంచి అంటే ఈ రోజు నుంచి ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రామోజీఫిల్మ్‌సిటీలో చిత్రీకరించనున్నట్లు యూనిట్‌ తెలిపింది. ఈ యుద్దం ఎపిసోడ్ సినిమాలో హైలెట్ అని చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

    మరో ప్రక్క 'బాహుబలి' కోసం ఓ భారీ యుద్ధాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ప్రధాన తారాగణంతో పాటు రెండు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులపై యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీనికోసం ఆరు నెలలు నుంచి చిత్రబృందం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. రెండు వేల మంది కళాకారులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఆ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు నెలల పాటు చిత్రీకరించనున్నారు.

    ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ '' 'బాహుబలి' యుద్ధం మొదలైంది. స్టోరీ బోర్డ్‌, ప్రి విజువలైజేషన్‌ వంటి పనులతో సన్నద్ధమవుతున్నాం'' అని తెలిపారు. దీనికి ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తారు. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

    English summary
    The big budget period drama ‘Baahubali’ has an epic war sequence that is expected to be a major highlight for the film. The production team has started filming this sequence in Ramoji Film City, with around 2000 junior artistes. Preparations for this sequence began a long time ago and filming is expected to go on until March. Peter Heins is choreographing the action sequences for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X