'బాహుబలి' ఒక్క సీన్ కి 3 నెలలు
హైదరాబాద్: రాజమౌళి,ప్రబాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలో కీలకమైన సీన్ కోసం మూడు నెలలు పాటు రాత్రిబవళ్లు కష్టపడతున్నారని తెలుస్తోంది. ఆ సీన్ మరోదో కాదు...యుద్దం. 'బాహుబలి' కోసం ఓ భారీ యుద్ధాన్ని తెరపై దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో కొన్నిటిని బ్లూ మ్యాట్ పై చిత్రీకరిస్తున్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడనివిధంగా ఉండాలని ఈ యుద్దం సన్నివేశాలను విదేశీ నిపుణుల సమక్షంలో తెరకెక్కిస్తున్నారు. సెకండాఫ్ లో వచ్చే ఈ యుద్దం సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు. దీనికి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం వహిస్తారు.
ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంతో పాటు రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులపై యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీనికోసం ఆరు నెలలు నుంచి చిత్రబృందం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. రెండు వేల మంది కళాకారులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఆ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు నెలల పాటు చిత్రీకరించనున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ ''వచ్చే నెలాఖరు నుంచి 'బాహుబలి' యుద్ధం మొదలవబోతోంది. స్టోరీ బోర్డ్, ప్రి విజువలైజేషన్ వంటి పనులతో సన్నద్ధమవుతున్నాం'' అని తెలిపారు.

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.


Click it and Unblock the Notifications











