»   » 'బాహుబలి' కేరళ షెడ్యూల్ లేటెస్ట్ ఇన్ఫో

'బాహుబలి' కేరళ షెడ్యూల్ లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:రాజమౌళి,ప్రబాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూగా ఫుల్ స్వింగ్ లో కేరళలో జరుగుతోంది. సినిమాలోని కీ సీన్స్ ని ఇక్కడ షూట్ చేస్తున్నారు. అలాగే కథలోని కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని సైతం ఇక్కడ ప్లాన్ చేసారు. డిసెంబర్ 3 వ తేదీ వరకు ఇక్కడ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది.

తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

అనుష్క ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ తదితరులు ఇతర తారాగణం. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. అనుష్క కి తమిళనాట కూడా మంచి మార్కెట్ ఉండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అలాగే సత్యరాజ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర చేయటం కలసివచ్చే అంశం.

అనుష్క మాట్లాడుతూ.. ''రాజమౌళి సినిమాల్లో నటించాలంటే నాకు చాలా ఇష్టం. అది కొంచెం కష్టం కూడా! తెరపై చూసినప్పుడు ఆ కష్టం తొలగిపోతుంది. నా పాత్రకు మంచి స్పందన వస్తుంది''అని పేర్కొంది. ఇందులో అనుష్క దేవసేన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. రెండురోజుల క్రితం అనుష్క పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక టీజర్‌ను కూడా విడుదల చేశారు. చరిత్రాత్మక కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీఎత్తున రూ.కోట్ల విలువైన సెట్లను వేస్తున్నారు సాబు శిరిల్‌.

English summary
Baahubali, S S Rajamouli's magnum opus is shooting in full swing. Presently the team is in Kerala. The film stars Prabhas, Anushka and Rana Daggubati in the lead. The Baahubali team is now shooting some key scenes of the film. Also some actions scenes are being shot in Kerala. The team informed us that this schedule will be wrapped by 3rd December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu