»   » బాహుబలి2 ‘1000’ కోట్ల టీజర్.. అదే సంచలనం..

బాహుబలి2 ‘1000’ కోట్ల టీజర్.. అదే సంచలనం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం సృష్టిస్తూ రికార్డులను తిరగరాస్తున్న వేళ చిత్ర యూనిట్ సరికొత్త టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ నిడివి 30 సెకన్లు. బాహుబలి2 సినిమాలోని కీలక, ఉద్వేగ భరిత సన్నివేశాలను ఈ టీజర్‌లో పొందుపరిచారు. తాజా టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ ఇదే.


రోజుకో సంచలనం

రోజుకో సంచలనం

సంచలన విజయం సాధిస్తున్న బాహుబలి ది కన్‌క్లూజన్ రోజుకో రికార్డును తిరగరాస్తున్నది. ఎన్నో ఏళ్లుగా తుప్పుపట్టిన రికార్డులన్ని బద్దలవుతున్నాయి. ఈ సినిమా విడుదలై దాదాపు పది రోజులు కావోస్తున్నా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదనే మాట వినిపిస్తున్నది. అందుకు తగినట్టుగానే కలెక్షన్ల కూడా జలపాతంలా బాక్సాఫీస్ వద్ద దూకిపడుతున్నాయి. గత పది రోజుల్లో బాహుబలి2 సినిమా రూ.1000 కోట్ల మార్కును దాటేయడం గమనార్హం.


పీకే రికార్డు తడిచిపెట్టిన

పీకే రికార్డు తడిచిపెట్టిన

బాహుబలి చిత్రం అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా రికార్డులను తడిచిపెట్టింది. పీకే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.792 కోట్ల వసూళ్లను అధిగమించి భారతీయ సినిమా పరిశ్రమలో రారాజుగా నిలిచింది. భారతీయ సినిమా చరిత్రలో ఇదే అత్యుత్తమ రికార్డు.


అమెరికాలో రూ.100 కోట్లు

అమెరికాలో రూ.100 కోట్లు

అమెరికాలో తొలి వారాంతంలో కూడా బాహుబలి భారీ కలెక్షన్లను రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసినట్టు వార్తలు అందుతున్నాయి. విన్ డిజెల్ నటించిన ఫాస్ట్ అండ్ ఫూరియస్, సల్మా హయెక్ నటించిన లాటిన్ లవ్ చిత్రాల తర్వాత మూడో స్థానంలో బాహుబలి నిలిచిన సంగతి తెలిసిందే.


1500 కోట్ల వైపు పరుగులు

1500 కోట్ల వైపు పరుగులు

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 హవా కొనసాగడం, కేవలం పది రోజుల్లోనే ఆ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి చరిత్రను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఇదే ఊపు కొనసాగితే బాహుబలి2 సినిమా రూ.1500 కోట్లకు సునాయసంగా చేరుతుందనే మాట బలంగా వినిపిస్తున్నది.English summary
Baahubali2 movie's new teaser released. Few emotional scenes added to new teaser. Latest teaser now trending in internet. Baahubali crossed Rs.1000 crores collections and heading towards to Rs.1500 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu