twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారూఖ్‌తోనే 'బాజీగర్‌-2', డిటేల్స్

    By Srikanya
    |

    ముంబై: ప్రస్తుతం సీక్వెల్స్ యుగం నడుస్తోంది. గత కాలం సూపర్ హిట్స్ అంతా సీక్వెల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా వీరి దృష్ఠి షారూఖ్ సూపర్ హిట్ చిత్రం పై పడింది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం బాలీవుడ్‌ బాద్‌షాగా షారూఖ్‌ ఖాన్‌కు స్టార్‌ డమ్‌ తెచ్చిపెట్టిన చిత్రం 'బాజీగర్‌' .

    ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుందా? అవుననే అంటున్నారు ముంబై సిని వర్గాలు. ఇక 'బాజీగర్‌' చిత్ర నిర్మాత గణేష్‌ జైన్‌ సోదరుడు రతన్‌ జైన్‌. షారూఖ్‌ ఖాన్‌తోనే సీక్వెల్‌ తీస్తామని ఆయన చెప్పారు.

    షారూఖ్‌ ఖాన్‌తో పాటుగా బ్లాక్‌ బ్యూటీ కాజోల్‌, పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి నటించిన బాజీగర్‌ 1993లో విడుదలై ఘనవిజయం సాధించింది. అబ్బాస్‌-మస్తాన్‌ దర్శక ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

    నెగిటివ్‌ రోల్‌లో సైతం హీరోయిజాన్ని ప్రదర్శించిన షారూఖ్‌ ఖాన్‌ అటు ప్రేక్షకుల అభిమానాన్ని, ఇటు విమర్శకుల ప్రశంసలను చూరగొన్నారు. ఈ చిత్రంతోనే షారూఖ్‌, కాజోల్‌ హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు.

    చాలా కాలంగా బాజీగర్‌కు సీక్వెల్‌ వస్తుందనే వార్తలు అడపా దడపా వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలో సీక్వెల్‌ తీస్తామని రతన్‌ జైన్‌ చెప్పారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేనప్పటికీ కొద్ది సంవత్సరాల్లో సీక్వెల్‌కు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు.

    ప్రస్తుతానికి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని జైన్‌ చెప్పారు. మూడు, నాలుగేళ్ళ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దామని ఆయన అన్నారు . ఇంతకు మించి సీక్వెల్‌కు సంబంధించిన వివరాలు మాట్లాడటం బాగుండదని జైన్‌ తెలిపారు.

    సీక్వెల్‌ చిత్రం ఒరిజనల్‌ చిత్రం తాలూకు మ్యాజిక్‌ను వెండితెరపై పండిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'వేటగాడు'గా రీమేక్‌ చేశారు. రాజశేఖర్‌, సౌందర్య, రంభ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు. భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.

    English summary
    Producer Ratan Jain currently has no plans for “Baazigar” sequel, but says he may do it after couple of years, but not without Shah Rukh Khan. “Yes, I am contemplating with the idea of the sequel to ‘Baazigar’, but not right now. I am busy with my other projects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X