»   »  బాలీవుడ్ సినిమాల్లోకి బాబా రామ్‌దేవ్: సయ్యా సయ్యా పాటలో నటించిన యోగా బాబా

బాలీవుడ్ సినిమాల్లోకి బాబా రామ్‌దేవ్: సయ్యా సయ్యా పాటలో నటించిన యోగా బాబా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాంగ్రెస్ హయాంలో కేవలం యోగా ఆయుర్వేద మూలికలకు మాత్రమే పరిమితమైన రాందేవ్ బాబా బీజేపీ అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రతి దాంట్లో వేలు పెడుతున్నారు. కారణం, బీజేపీ పార్టీ పూర్తిగా హిందూ భావాలను కలిగి ఉండడం, ఆ పార్టీలో ఉన్న ప్రధాన మంత్రులతో రాందేవ్ బాబా కి పరిచయాలు కూడా బాగానే ఉన్నాయి. అందుకే వాటితో దేశ వ్యాప్తంగా వ్యాపారానికి తెర లేపారు రాందేవ్ బాబా. వేల కోట్ల వ్యాపారం కొనసాగిస్తూనే అటు సినిమాల్లోకీ అడుగు పెడుతున్నారు...

ఆగ‌స్టు 18న విడుద‌లకానున్న యే హై ఇండియా చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యోగా గురువు బాబా రామ్‌దేవ్ జోరుగా పాల్గొంటున్నారు. ఈ సినిమాతో ఆయ‌న బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఈ సినిమాలోని స‌య్యా స‌య్యా అనే పాట‌లో ఆయ‌న కొద్దిసేపు క‌నిపించ‌నున్నారు.

Baba Ramdev makes Bollywood debut

యే హై ఇండియా సినిమాను లామ్ హ‌ర్ష్ డైరెక్ట్ చేస్తున్నారు. మ‌న దేశం వేదాల‌ను అందించింద‌ని, కానీ కొంద‌రికి మ‌న దేశం గురించి తెలియ‌ద‌ని, ఈ సినిమాలో మ‌న దేశం గురించి గొప్ప‌గా చూపించార‌ని బాబా రామ్‌దేవ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌పంచాన్ని పాలించే సామ‌ర్థ్యం భార‌త్‌కు ఉంద‌ని, అలాంటి స‌న్నివేశాల‌ను ఈ చిత్రంలో చూపించార‌ని, అందుకే ఈ సినిమాకు స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు రామ్‌దేవ్‌ తెలిపారు. ఆగ‌స్టు 18న యే హై ఇండియా ఫిల్మ్ రిలీజ్‌కానున్న‌ది.

English summary
Yoga guru Baba Ramdev has come on board to promote the upcoming film "Yeh Hai India". He will also be seen in the song "Saiyan Saiyan" from the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu