For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘రుద్రమదేవి’ షూటింగులో గాయపడ్డ బాబాసెహగల్

  By Bojja Kumar
  |
  హైదరాబాద్ : గాయకుడిగా తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తున్న ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ గుణశేఖర్ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక భారీ చిత్రం 'రుద్రమదేవి'లో నాగదేవుడిగా విలన్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా గాయపడ్డారు. అతనికి హెయిర్‌లైన్ ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తోంది.

  దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి నెల రోజులకు పైగా పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో దర్శకుడు గుణ శేఖర్ బాబా సెహగల్ లేకుండానే షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నటుడిగా మారుతున్న తొలిసినిమాలోనే ఇలా జరుగడంపై బాబా సెహగల్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది.

  ఏప్రిల్ 27న ప్రారంభమైన 'రుద్రమదేవి' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఒక్కడు మూవీకి చార్మినార్ సెట్ నిర్మించిన గోపన్నపల్లిలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎరీనా సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ బేనర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత దేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా 'రుద్రమదేవి'ని తెరకెక్కిస్తున్నారు.

  'రుద్రమదేవి'గా అనుష్క, చాళుక్య వీరభద్రుడుగా రానా, గణపతిదేవుడుగా కృష్ణం రాజు, శివదేవయ్యగా ప్రకాష్ రాజ్, హరి హర దేవుడుగా సుమన్, మురారి దేవుడుగా ఆదిత్య మీనన్, అన్నాంబికగా నథాలియా కౌర్, ముమ్మడమ్మగా జారాషా, మదనికగా హంసానందిని, అంబదేవుడుగా జయప్రకాష్ రెడ్డి, గణపాంబగా అదితి చెంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటిస్తున్నారు.

  భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ఈ రోజు నుంచి డిసెంబర్ వరకు జరిగే 5 భారీ షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తవుతుంది' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

  English summary
  singer Baba Sehgal, who plays a Naga Devudu in Gunasekhar masterpiece ‘Rudhramadevi‘ recently injured while canning some scenes of high-octane action. A source from the unit shares, “It was a fracture and advised him to rest for some time. Nevertheless, the director is planning to shoot the portions without him.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X