»   » ఐటం సాంగ్ చేస్తున్న పాప్ స్టార్ బాబా సెహగల్

ఐటం సాంగ్ చేస్తున్న పాప్ స్టార్ బాబా సెహగల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియాలో పస్ట్ పాప్ ఆర్టిస్ట్ ఎవరంటే బాబా సెహగల్ అనే వినిపిస్తుంది. అయితే ఆయన ఇంతకాలం తన ఆల్బమ్స్ లోనే గానీ ఎప్పుడూ సినిమాల్లో కనపడలేదు. అయితే తాజాగా ఆయన పృద్వీ అనే కన్నడ చిత్రంలో ఐటం సాంగ్ చేయటానికి ఎగ్రిమెంట్ పై సైన్ చేసి అందరనీ ఆశ్చర్యపరిచారు. మొదట ఈ చిత్రంలో ఓ పాటను ఆయన చేత పాడించారు. అయితే ఆ పాటను అంత బాగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసే ఆర్టిస్టు కోసం దర్శక,నిర్మాతలు వెతికారు. కానీ వారికి ఆ రేంజి వ్యక్తి దొరక్క బాబా సెహగల్ నే కలిసి తమ సమస్య చెప్పి ఆయన్నే నటింప చేయమన్నారు. దాంతో ఆయన ఒప్పుకుని త్వరలో బెంగుళూరులోని ఇన్నోవేటివ్ పిల్మ్ సిటీలో నర్తించటానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో దిలీప్ పాయ్, నిషా షెట్టి హీరో, హీరోయిన్స్ గా చేస్తున్నారు. బాబా సెహగల్ రీసెంట్ గా తెలుగులో ఆర్య 2, అదుర్స్ లోని పాటలు పాడిన సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu