»   » పవన్, చిరంజీవిపై బాబా సెహగల్ పాటలు, పబ్లిసిటీ కోసమేనా ఈ ఆరాటం?

పవన్, చిరంజీవిపై బాబా సెహగల్ పాటలు, పబ్లిసిటీ కోసమేనా ఈ ఆరాటం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగం, సినిమా రంగంలోని వ్యక్తులు ఎప్పుడూ పాపులారిటీ, పబ్లిసిటీ అనే రెండు అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి(రు). ఎందుకంటే పవర్, పబ్లిసిటీ, పాపులారిటీ ఉన్నంత వరకే ఈ రంగంలో మనుగడ. ఇక కొత్తగా సినీ రంగంలోకి వచ్చిన వారు పాపులారిటీ పెంచుకోవడానికి తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తుంటారు. అఫ్ కోర్స్....అదంతా వారి వృత్తి ధర్మంగా కూడా భావించొచ్చు.

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన సింగర్ బాబా సెహగల్ పబ్లిసిటీ పెంచుకోవడానికి తదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పాపులారిటీని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు 'పవనిజం' సాంగును విడుదల చేసి సక్సెస్ అయిన బాబా సెహగల్ తాజాగా....చిరంజీవిపై కూడా ఓ పాటను విడుదల చేయబోతున్నారు.

'హలో చిరు..హలో చిరు..హౌ ఆర్ యు' అంటూ సాగే ఈ పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ పాటకు సంబంధించిన టీజర్ విడుదల చేసిన బాబా సెహగల్ త్వరలోనే పూర్తి పాటను విడుదల చేస్తానని అంటున్నారు. ఈ పాటలో చిరంజీవిని ఎంతో గొప్పగా వర్ణించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

మెగా హీరోపై పాట అంటే మెగా అభిమానులకు ఆసక్తి ఉండటం సహజమే. చిరంజీవిపై టీజర్ విడుదలైనప్పటి నుంచి పూర్తి పాట ఎప్పుడు వస్తుందా? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ పాట వల్ల రెండు బెటిఫిట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమా రంగంలో చర్చనీయాంశం అవుతాడు, బాబా సెహగల్‌కు తాను ఊహించిన పబ్లిసిటీ దక్కుతుంది. అదన్నమాట సంగతి.

English summary
The original Indian rapper, Baba Sehgal release his much anticipated song ''Hello chiru, hello chiru how are you' on the sets of reality show Bol Baby Bol 3.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu