»   » పవన్ కళ్యాణ్ మీద మరోటి వస్తోంది, ఇక పండగే!

పవన్ కళ్యాణ్ మీద మరోటి వస్తోంది, ఇక పండగే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా అభిమానులు అమితాసక్తి చూపుతుంటారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా ‘పవనిజం' పేరుతో అభిమానులు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ మీద అభిమానుల్లో ఉన్న ఆసక్తిని గమనించిన ప్రముఖ పాప్ సింగర్ బాబా సైగల్ అప్పట్లో పవర్ స్టార్ మీద ఓ పాటను కంపోజ్ చేసారు. అప్పట్లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆయన మరో పాటను కంపోజ్ చేసి విడుదల చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)న ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ‘ఎ పవర్ సాంగ్' అనే టైటిల్ తో ఈ పాట విడుదల కానుంది.

Baba Sehgal to release new single on Pawan Kalyan

పవన్ కళ్యాణ్ సినిమాలైన జల్సా, గబ్బర్ సింగ్ చిత్రాల్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ పాడిన బాబా సైగల్ అభిమానులతో సూపర్బ్ అనిపించుకున్నారు. ఆయన సినిమాలకు పాటలు పాడటం వల్ల బాబా సైగల్ కు ఇక్కడ మంచి గుర్తింపువచ్చింది. ఇపుడు నటుడిగానూ పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. త్వరలో ‘రుద్రమదేవి' సినిమాలో కనిపించబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ‘సర్దార్' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఇక్కడ కీలకమైన యాక్షన్ సన్నివేశాలు. కొన్నీ సీన్లు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Popular singer Baba Sehgal, is all set to release a new single, a Power Song, on Pawan Kalyan, on the eve of Powerstar’s birthday.
Please Wait while comments are loading...