బాబా సెహగల్ కూడా 'ఆగడు' ని అనేసాడు

దాంతో మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజిలో అతన్ని ఆడుకోవటంతో వెంటనే.. ఆగడు మంచి బిజినెస్ చేస్తూందని, శ్రీను వైట్ల కు మంచి అభిమానిని అని చెప్పుకొచ్చాడు. తెలుగులో అందరు టాప్ హీరోలకి పాటలు పాడానని ఇప్పుడు మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్నానని అని శాంతింప చేసాడు. పవన్ కి పాటలు పాడి పాపులర్ అయిన బాబా సెహగల్ ఇలా మహేష్ సినిమాపై విమర్శలు చేసి, రేపు ఆయన సినిమాకు ఎలా పనిచేస్తాడని కొందరు డైరక్ట్ గానే అంటున్నారు.
ఇక బాబా సెహగల్ గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'రుద్రమ దేవి' సినిమాలో నాగ దేవుడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ జరుగుతుండగా ఆయన పాదానికి గాయం అయ్యింది. కొద్ది రోజుల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఈ సినిమాలో అనుష్క , రానా దగ్గుపాటిలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అనుష్క ఈ సినిమాలో ఒక యోదురాలైన యువరాణిగా, అలాగే రానా చాళుక్య వీరభద్రగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











