Just In
Don't Miss!
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Sports
పతంగి ఎగురవేసిన ఇర్ఫాన్ పఠాన్.. కైట్ కోసం పిల్లల పాట్లు వీడియో
- News
'డ్యాన్స్'పై ఆసక్తి.. ఊహించని మలుపులు తిరిగిన జీవితం.. లింగ మార్పిడి,మూడేళ్లుగా గ్యాంగ్ రేప్...
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
"బాబు బంగారం" వచ్చేస్తున్నాడు తేదీలు ఇవే జులై 24 ఆడియో, అగష్టు 12
విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, మారుతి దర్శకుడిగా సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. షూటింగ్ మెత్తం పూర్తయింది. జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ ని ఇటీవలే విడుదల చేశారు. ఆసాంగ్ చాలా మంచి రెస్పాన్స్ రావటం యూనిట్ అంతా హ్యపిగా వున్నారు. ఆడియోని జులై 24న విడుదల చేసి, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అగష్టు 12న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడదల చేస్తున్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ."విక్టరి వెంకటేష్, నయనతార కాంబినేషన్లో వరుస సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు మారుతి డైరక్షన్ లొ మా బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పైన , ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకష్ణ(చినబాబు) సమర్పణలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాబుబంగారం చిత్రాన్ని నిర్మించాము. దీనికి సంభందించిన మెదటి లుక్ టీజర్ మరియు సింగిల్ ట్రాక్ కి విపరీతంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చాలా మంచి పాజిటివ్ బజ్ వచ్చింది.
సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా నిలవటం చాలా హ్యపిగా వుంది.సౌత్ క్రేజి మ్యూజిక్ దర్శకుడు జిబ్రాన్ అందించిన ఆడియోని 24న విడదల చేసి, చిత్రాన్ని అగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాము. ఈచిత్రం వెంకటేష్ గారి అభిమానులతో పాటు ఫ్యామిలి ఆడియన్స్ ని చక్కగా ఆకట్టుకుంటుంది "అని అన్నారు

ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, బ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి, పృద్వి, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మజి, సంపత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మున్నా వేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర, రజిత, గుండు సుదర్శన్. డాన్స్- బృంద, శేఖర్, స్టంట్స్- రవి వర్మ,ఆర్ట్- రమణ వంక, ఎడిటర్- ఉద్దవ్.ఎస్.బి, పి.ఆర్.ఓ- ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, సంగీతం- జిబ్రాన్, నిర్మాతలు- సూర్యదేవర నాగ వంశి, పి.డి.వి.ప్రసాద్, కథ,కథనం,దర్శకత్వమ్ - మారుతి