»   » వెంకీ, నయన రొమాన్స్ మళ్లీ వర్కౌట్ అవుతుందా? (న్యూ పోస్టర్)

వెంకీ, నయన రొమాన్స్ మళ్లీ వర్కౌట్ అవుతుందా? (న్యూ పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్టరి వెంకటేష్ హీరోగా, నయనతార హీరోయిన్ గా డైరక్టర్ మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తెరకెక్కుతున్న చిత్రం 'బాబు బంగారం'. సూర్యదేవర నాగ వంశి, పిడివి ప్రసాద్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కతోంది.

గతంలో వెంకటేష్, నయనతార కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి, తులసి చిత్రాల్లో వీరి మధ్య రొమాంటిక్ కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యేలా పక్కాగా సీన్లు రాసారట దర్శకుడు మారుతి. తాజాగా విడుదలైన 'బాబు బంగారం' పోస్టర్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. లుక్ పరంగా వెంకటేష్, నయనతార సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్.


ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ జూన్ 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...'ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార మూడ‌వ‌సారి న‌టిస్తున్నారు. గతంలో వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ల‌క్ష్మి, తుల‌సి చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాదించిన విష‌యం తెలిసిందే. ఈచిత్రం కూడా ఆదే తరహాలో ఘన విజ‌యం సాధిస్తుంద‌న‌టంలో సందేహం లేదు' అన్నారు.


Babu Bangaram teaser on 6th June

'అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. వెంక‌టేష్ గారి కామెడి టైమింగ్స్ ని మైండ్ లో పెట్టుకుని మారుతి డైలాగ్స్ రాసారు. ఈ చిత్రాన్ని జులై లో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము' అని అన్నారు.


బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పృధ్వి, మురళీశర్మ, దేవ్ గిల్, జయప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: SB.ఉద్దవ్, కళ: రమణ వంక, చాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్, రచన-దర్శకత్వం: మారుతి!

English summary
Victory Venkatesh, Naynatara's Babu Bangaram teaser releasing on 6th June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu