»   » ఆ సీన్లు ఉంటాయి.., 48 నుంచి 8 కట్స్ కి వచ్చిన బాబూ మొషాయ్: కొత్త పాట ఇదే

ఆ సీన్లు ఉంటాయి.., 48 నుంచి 8 కట్స్ కి వచ్చిన బాబూ మొషాయ్: కొత్త పాట ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

గ్యాంగ్ వార్, మాఫియా వంటి కథల నేపథ్యంలో బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. చాలా వరకు సినిమాలు సూపర్ హిట్ సక్సెస్ సాధించాయి కూడా. రియాలిటీ కోసం ఇలాంటి సినిమాల్లో రేప్ సీన్లను, హత్యలను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి ప్రతి సినిమాలోనూ బ్రోతల్ హౌజ్ అనే ఓ చిన్న ఎలిమెంట్ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది.

బాబు మొషాయ్ బందూక్ బాజ్

బాబు మొషాయ్ బందూక్ బాజ్

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నవాజుద్దిన్ సిద్దిఖీ సినిమా ‘బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాలో కూడా ఇలాంటి సీన్లు బాగానే ఉన్నాయి. అందుకే పాపం సెన్సార్ వాళ్ళు ఎడతెరిపి లేకుండా ఎడిటర్లు గామాఎరి సినిమాని 48 కట్లతో "ఎడిట్ చేసి పారేశారు"

ఏకంగా 48 కట్స్

ఏకంగా 48 కట్స్

ఏకంగా 48 కట్స్ చెప్పి ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో ఆ చిత్ర నిర్మాత, దర్శకులు షాకయ్యారు.నిహ్లానీ దెబ్బకు బాబు మొషాయ్ టీం కు మైండ్ బ్లాక్ అయింది. ఈ క‌ట్స్ పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కేవ‌లం అభ్యంతరకర షాట్స్ మాత్రమే తొలగించమని సూచించామని, సీన్స్ ను తీసివేయలేదని సెన్సార్ బోర్డ్ చెప్పింది.

అప్పిలేట్ ట్రిబ్యునల్

అప్పిలేట్ ట్రిబ్యునల్

కానీ దర్శక నిర్మాతలు మాత్రం అదంతా తూచ్... మీరు కావాలనే కత్తెర వాడారూ అంటూ గోలచేసేసింది. సెన్సార్ బోర్డ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసి...చేసీ.. ఇకలాభం లేదనుకొని చిత్రయూనిట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ నుంచి బాబు మొషాయ్ చిత్రానికి రిలీఫ్ లభించింది.

మరో సాంగ్ రిలీజ్

సెన్సార్ బోర్డ్ 48 కట్స్ సూచించిన ఈ సినిమాకు రివ్యూ కమిటీ కేవలం 8 కట్స్ మాత్రమే చెప్పి సరే ఇంక వెళ్ళండీ అందట. సెన్సార్ క్లియరెన్స్ లభించిన ఆనందంలో బాబు మొషాయ్ టీమ్ మరో సాంగ్ ను రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సాంగ్ వెనక పడ్డారు జనాలంతా... చూసిందే సూడబుద్దేత్తుందండీ అంటూ మళ్ళీ మళ్ళీ చూసేస్తున్నారు.

English summary
Nawazuddin Siddiqui-starrer Babumoshai Bandookbaaz has been cleared by the Film Certification Appellate Tribunal (FCAT) with eight “minor and voluntary cuts”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu