»   »  తండ్రి అయిన దర్శకుడు వీరూ పోట్ల

తండ్రి అయిన దర్శకుడు వీరూ పోట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : బిందాస్,రగడ చిత్రాలతో తనకంటూ ముద్ర వేసుకుని దూసుకెళ్తాతో దూసుకెళ్లటానికి సిద్దమవుతున్న దర్శకుడు వీరూపోట్ల. ఆయన రీసెంట్ గా ఓ బుజ్జి పాపకు తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్వీట్ ద్వారా తెలియచేసారు. చాలా మంది వ్యక్తిగతంగానూ..ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ధట్స్ తెలుగు కూడా వీరూపోట్లకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

  మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ..." .మీరు ఓ అందమైన బేబి కి తండ్రి అయ్యినందుకు.. వీరూ పోట్ల మీకు శుభాకాంక్షలు :-) మీకు మీ కుటుంబానికి మేలు జరగాలని... :) ", అంటూ ట్వీట్ చేయటంతో అందరికీ తెలిసింది. ఇక మంచు మనోజ్ తో వీరూపోట్ల గతంలో బిందాస్ చిత్రం చేసారు. అలాగే మంచు మనోజ్ సోదరుడు విష్ణుతో... దూసుకెళ్తా చిత్రం చేసారు. అది రేపు విడుదల అవుతోంది.

  మంచు విష్ణు కథానాయకుడుగా వీరు పోట్ల దర్శకత్వంలో నిర్మించిన 'దూసుకెళ్తా' చిత్రం సెన్సార్ నుండి యు/ఏ సర్ట్ఫికెట్ అందుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 17న విడుదల చేయనున్నారు. నిర్మాత మోహన్‌బాబు మాట్లాడుతూ తొలి కాపీ చూశాక చిత్రంపై పూర్తి సంతృప్తి వచ్చిందని, హీరో నృత్యాలు, పోరాటాలు వైవిధ్యంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, వీరుపోట్ల టేకింగ్, రవితేజ వాయిస్‌వోవర్, లక్ష్మీప్రసన్న అతిథి పాత్ర చిత్రానికి ఆకర్షణగా ఉంటాయని, 600 థియేటర్లకుపైగా ఈ సినిమాను ఈనెల 17న విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు


  ప్రపంచ వ్యాప్తంగా విష్ణు కెరియర్‌లోనే అత్యథిక థియేటర్‌లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల తరువాత అదే తరహాలో విష్ణు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వీరూ పోట్ల డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో మంచు విష్ణు పాత్రకేయుడుగా కనిపిస్తారు. అలాగే డాక్టర్‌ అలేఖ్యగా లావణ్య కనిపిస్తుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురరి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆర్.విజయకుమార్.

  English summary
  Ace director Veeru Potla is blessed with a baby girl. Veeru Potla directed films like Bindaas,Ragada and his latest film Doosukeltha with Vishnu is ready for release. Congratulatory messages are pouring in from celebrities. Manchu Manoj congratulated saying “I congratulate VeeruPotla1 for becoming DAD to a beautiful Baby Girl:-) May god bless ur family with love happiness success :) ”,
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more