»   » మహేష్ కూతురు సితార వీడియో హల్ చల్

మహేష్ కూతురు సితార వీడియో హల్ చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు కూతురు సితారకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల సినీ‘మా' అవార్డుల కార్యక్రమంలో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు మూవీ పాట ప్లే కాగానే... సితార స్టేజీమీద డాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోను మహేష్ బాబు అభిమానులు షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

మహేష్ బాబు కూతురు ఎంత ముద్దొస్తోందో (ఫోటోలు)సినిమాలతో బిజీగా ఉండే మహేష్ బాబు తన మిగిలిన సమయం మొత్తం కుటుంబానికే కేటాయిస్తాడు. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా గడుపుతాడు. కూతురు సితార అంటే ఆయనకు ప్రాణం. సోషల్ మీడియా ద్వారా తన పిల్లలతో గడిపిన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.


ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా సితార గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తను చాలా డిమాండింగ్‌. స్కూల్‌ నుంచి తాను రాగానే అందరి ఫోకస్‌ తనమీదే ఉండాలి. పక్కవారితో మాట్లాడితే ఒప్పుకోదు. ఫోన్లో మాట్లాడినా వూరుకోదు. ఫోన్లు విసిరి కొడుతుంటుంది. టైమ్‌ అంతా సితారకే ఇవ్వాలి. కానీ అదంతా నాకు హ్యాపీగా అనిపిస్తుంటుంది. తాను భోజనం చేస్తున్నప్పుడు నా పాటలే పెట్టాలి. పాట మొత్తం పాడేస్తుంటుంది. డాన్స్‌ చేస్తుంటుంది. సితారని చూస్తుంటే మా అమ్మమ్మగారు గుర్తొస్తుంటారు అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.


Baby Sitara Dance at Cinemaa Awards

గౌతం గురించి చెబుతూ...నాన్నగారి పుట్టినరోజున సరదాగా గౌతమ్‌తో ఏమైనా చేయించాలనిపించింది. అప్పుడే పండుగాడు డైలాగ్‌ గుర్తుకొచ్చింది. ఆ డైలాగ్‌ని డబ్‌స్మాష్‌లో గౌతమ్‌తో చెప్పించి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పెట్టా. మంచి స్పందన వచ్చింది. అభిమానులు చాలా ఆనందపడ్డారు. గౌతమ్‌ నాకంటే బాగా ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చాడు (నవ్వుతూ).పట్టుబట్టి మరీ తీసుకెళతాడు. నాకు పనుందన్నా వదిలిపెట్టడు. ఒకట్రెండుసార్లు తప్పించుకొనే ప్రయత్నం చేశా. కానీ కుదర్లేదు. నేను స్కూల్‌కి వెళితే వాడికి అదొక ఆనందం.

English summary
Mahesh babu along with his family attended an award function where Sitara sat in the front row, when the award was presented to him; his songs were played, for which Mahesh Babu’s daughter Sitara danced on the stage.
Please Wait while comments are loading...