»   »  ఇప్పుడు అమితాబ్ వంతు

ఇప్పుడు అమితాబ్ వంతు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Amitabh Bachan
'కృష్ణార్జున, గది నెంబర్ 305 లో దేముడు' చిత్రాలకు మూలమైన జిమ్ క్యారి చిత్రం 'బ్రూస్ ఆల్మైటీ' తాజాగా మరో అవతారం ఎత్తబోతోంది. ఈ సారి హిందీలో 'గాడ్ తూస్సి గ్రేట్ హొ' పేరుతో ఫ్రీమేక్ అయ్యింది. సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా , అమితాబ్ ఈ చిత్రం ప్రథాన పాత్రలలో కనిపించనున్నారు. కథ ప్రకారం అరుణ్ ప్రజాపతి (సల్మాన్ ఖాన్) ఫెయిల్యూర్ టి.వి.యాంకర్. అతను మరో యాంకర్ అలియా(ప్రియాంక చోప్రా) ప్రేమలో ఉంటాడు. కాని ధైర్యంగా ఆ విషయం ఆమెకు చెప్పలేక పోతాడు. ఈ లోగా కొత్తగా వచ్చిన రాకి అనే మరో యాంకర్ ఆమెని గద్దలా తన్నుకు పోతాడు. దాంతో తట్టుకోలేక ఈ భాధలన్నిటికి దేముడిదే భాధ్యత అంటూ తిడతాడు.

అప్పుడో అద్బుతం జరుగుతుంది. దేముడు (అమితాబ్) రంగంలోకి దిగుతాడు. వారం రోజుల పాటు తన శక్తులు మన హీరోకి ఇవ్వటానకి రెడి అవుతాడు. ఇక అప్పటి నుంచి జరిగే తమాషా నవ్వులు పండిస్తుంది. ఒరిజనల్ సినిమాకి బాగా దగ్గరగా ఉన్న ఈ కథ తప్పని సరిగా విజయం సాథిస్తుందనే ఆశతో ఉన్నాడు దర్శకుడు రూమి జాఫ్రి. ఇక తెలుగులో నాగార్జున , తమిళంలో ప్రకాష్ రాజ్ ఈ దేముడు పాత్రని పోషించారు. ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక ఇప్పుడు అమితాబ్ వంతు వచ్చింది. మరి ఆయన యే రేంజిలో ఈ సినిమాని నిలబెడతాడో చూడాలంటున్నారు విశ్లేషకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X