For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాక్షన్ విత్ మసాలా... (బ్యాడ్ బాయ్ ప్రివ్యూ)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: గత సినిమా 'శకుని' బాక్సాఫీసు వద్ద నిరాశ పరచడంతో... ఈ సారి ఎలాగైనా బాక్సాఫీసును షేక్ చేసేందుకు బ్యాడ్ బాయ్ అవతారం ఎత్తాడు తమిళ హీరో కార్తి. ఇప్పటికే 'అలెక్స్ ప్యాండన్‌'గా తమిళ నాట విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం తెలుగులో 'బ్యాడ్ బాయ్'తో శుక్రవారం విడుదలవుతోంది.

  సినిమాకు సాలిడ్ స్టోరీ ఏమీ లేక పోయినా... మసాలా ఎలిమెంట్స్, రిచ్ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. 'బ్యాడ్ బాయ్' అనేది యాక్షన్ విత్ మసాలా అంశాలు కలగలిపిన చిత్రం. కార్తి చురుకైన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శరవనణ్ ఫోటోగ్రఫీ, అమేజింగ్ స్టంట్స్, చేజింగ్ సీన్స్, డైలాగులు, సంతానం కామెడీ, అనుష్క గ్లామర్ కలగలిపి ఈ సినిమాను పూర్తి వినోదాత్మక మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందించారు.

  అసలు బ్యాడ్ బాయ్ సినిమాలో కొత్తదనంతో కూడిన స్టోరీ లేనేలేదు. దర్శకుడు సూరజ్ 1980ల నాటి ఓల్డ్ స్టోరీని బేస్ చేసుకుని సినిమాను నడిపించాడు. అయితే లేటెస్ట్ టెక్నీలజీ, తన దర్శకత్వ ప్రతిభను కలిగలిపి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేసాడు. మరి తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి.

  స్లైడ్ షోలో... స్టోరీ, ఇతర వివరాలు

  మిరిమిట్లు గొలిపే ట్రైన్ చేజింగ్ సీన్ తో సినిమా ప్రారంభం అవుతుంది. కార్తి పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

  కథ వివరాల్లోకి వెళితే... డాక్టర్ జికెఎం(సుమన్), అల్విన్ మార్టిన్(మిలింద్ సోమన్) తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే నలికీ మెడిసిన్స్ పంపిణీ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ మేరకు గవర్నమెంటుతో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తారు. అయితే ముఖ్యమంత్రి అందుకు అంగీకరించరు.

  దీంతో వారు లోకల్ దొంగ (కార్తి) ద్వారా సిఎం కూతురు(అనుష్క)ను కిడ్నాప్ చేస్తారు. కార్తి ఆమెను అడవిలోకి తీసుకెళ్లి దాస్తాడు. ఈ క్రమంలో అనుష్క కార్తితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా కథ.

  సినిమాలో సంతానం కామెడీ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది.

  సినిమా తొలి సగభాగం వినోదాత్మకంగా బోర్ లేకుండా సాగుతుంది.

  సెకండాఫ్ లో రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలతో ఫర్వాలేదనిపిస్తుంది.

  అయితే సినిమా మొత్తం మనం ఊహించినట్లు జరుగుతుండటం కాస్త నిరాశ పరుస్తుంది.

  సినిమా పూర్తి విశ్లేషణ... మా క్రిటిక్స్ మరికాసేపట్లో మీకు అందిస్తారు.

  English summary
  Eight months after the release of Sakuni, Tamil actor Karthi has made his comeback to Tollywood. He might have failed to impress Tamil audience with Alex Pandian, but its Telugu version Bad Boy will definitely rock the film goers in Andhra Pradesh. This movie does not have a solid story, but its masala elements and rich production values are its biggest strengths.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X