మళయాళం విడుదలలో అల్లు అర్జున్ 'బద్రినాధ్' కొత్త రికార్డు
అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన 'బద్రినాథ్' చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెయ్యి థియేటర్లలో చిత్రం ట్రైలర్‌ని ప్రదర్శిస్తున్నారు.ఇలా వెయ్యి ధియోటర్స్ లో ఒక తెలుగు చిత్రం ట్రైలర్స్ విడుదల చేయటం కూడా ఓ రికార్డే అని బన్నీ అభిమానులు అంటున్నారు. అలాగే ఈ చిత్రం కేరళలలో వంద ధియోటర్స్ లలో విడుద కానుంది. గతంలో అక్కడ అల్లు అర్జున్ నటించిన చిత్రాలకు వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. దర్శకుడు వినాయక్ ప్రత్యేక శ్రద్ధతో 'బద్రినాథ్' చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంది.పీటర్ హెయిన్స్ సారథ్యంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ కలిగిస్తాయి.


Click it and Unblock the Notifications











