»   » విడుదలకు ముందే బన్నీ‘బద్రినాథ్’రికార్డుల మోత..!

విడుదలకు ముందే బన్నీ‘బద్రినాథ్’రికార్డుల మోత..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'బద్రీనాథ్'. ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్ళిన చిత్ర యూనిట్ చిత్రీకరణ పూర్తిచేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది అని సమాచారం. అక్కడ 'చిరంజీవా.., చిరంజీవా...' అంటూ సాగే ఈ పాటను అల్లు అర్జున్ తమన్నా ల ఫై చిత్రీకరించారని తెలుస్తుంది.

తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ప్రాచీన భారతీయ సమరయోధుడిగా నటిస్తున్నాడు . గీతాఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ ప్రతిస్థాత్మకంగా నిర్మిస్తున్నారు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం నేపద్యంలో సాగే ఈ సినిమా కు కధను చిన్నకృష్ణ అందించారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొంది ఇటివలే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లబిస్తుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వివి వినాయక్ డైరెక్షన్ లో అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'బద్రినాథ్"..ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు ట్రెడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఐతే వారి అంచనాలని నిజం చేస్తూ 'బద్రినాథ్" కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దాదాపు 6కోట్లకు అమ్ముడు పోవడం తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలిసారి ఇంతవరకు ఏ చిత్రానికీ ఇంత మొత్తం లభించలేదని ట్రెడ్ వర్గాలు విస్మయాన్ని వ్యక్తపరుస్తుండటం విశేషం..రిలీజ్ కు ముందే రాకార్డుల మోతని ప్రారంభించిన బన్నీ 'బద్రినాథ్" చిత్రంతో 'మగధీర" రికార్డ్స్ ని టచ్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే...

English summary
Allu Arjun is acting in a new film under the direction of VV Vinayak. Tamanna is the heroine. The film is progressing briskly and 90 percent of the film has been completed so far. In Karnataka Film distributors have bagged the overseas rights 6 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu