బద్రి.... భలే ఫన్నీగా ఉన్నాడే (టీజర్)
రణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘బద్రినాథ్ కి దుల్హనియా’. వరుణ్ ధావన్, ఆలియాభట్ జంటగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ముంబై: ధర్మ ప్రొడక్షన్స్ పతాంకపై కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'బద్రినాథ్ కి దుల్హనియా'. వరుణ్ ధావన్, ఆలియాభట్ జంటగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది.
గతంలో వరుణ్ ధావన్, ఆలియాభట్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', 'హంప్టీ శర్మాకీ దుల్హనియా' చిత్రాల్లో కలిసి నటించారు. మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన టీజర్‌ను ఫన్నీగా ఉంది.
మార్చి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బద్రీనాథ్ అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. తనకు పర్ఫెక్టుగా సూటయ్యే వదువు కోసం వెతికే బద్రి అనే పాత్రలో వరుణ్ ధానవ్ నటించాడు.


Click it and Unblock the Notifications











