»   » బధ్రినాధ్ లో అల్లు అర్జున్ వేసినటువంటి స్టెప్పులు అదరహొ..!

బధ్రినాధ్ లో అల్లు అర్జున్ వేసినటువంటి స్టెప్పులు అదరహొ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో అల్లు అర్జున్ ను బన్నీ అంటూ కొత్తగా చూపించిన దర్శకుడు వీవీ వినాయక్. ప్రస్తుతం ఈ యువ కధానాయకుడుతో బధ్రినాధ్ గా ఓపవర్ పుల్ పాత్రలో చూపించడానికి సిధ్దమయ్యారు. ఈ ఇద్ధరి కలయికలో రూపోందుతున్న చిత్రంలో మిల్కీవైట్ భామ తమన్నా కధానాయకగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. గత 45 రోజులుగా కులుమనాలిలో భారీ షెడ్యూల్ జరుపుకోని ఈ చిత్రం యూనిట్ ఈ నెల 23న హైదరాబాద్ చేరుకున్న విషయం అందరికి తెలిసిందే.

కులుమనాలిలో వేసిన భారీ సెట్లో 30శాతం టాకీతో పాటు బన్నీ, తమన్నాలపై అక్కడి అందమైన లోకేషన్స్ లో మూడు పాటలను మరియు పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఓ ఆసక్తి కరమైన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారని సమాచారం. మిగిలిన మూడు పాటలను హైదరాబాద్ లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. గతంలో అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి చిత్రానికి కధను అందించిన ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఇచ్చిన మరో అధ్బుతమైన కధతో ఈ చిత్రం తెరకెక్కుతుందని అన్నారు.

ప్రతి చిత్రంలోనూ డ్యాన్సుల్లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న అల్లు అర్జున్ ఈ చిత్రంలో కూడా తన అభిమానులును అలరించనున్నట్లు సమాచారం. కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఇందులో అన్ని పాటలకు నృత్య రీతులను సమకూర్చుడం ఇంకోక విశేషం. ఈ సినిమాలో అల్లు అర్జున్ వేసినటువంటి కోన్ని స్టెప్పులు తమ అభిమానులను మైమరపింప చేస్తామని అన్నారు. అంతేకాకుండా బాలీవుడ్ విలక్షణ నటుడు నానాపటేకర్ ఈ చిత్రంలో ఓ ముఖ్యభూమికను పోషిస్తున్నారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu