»   » అల్లు అర్జున్ - తమన్నా కులుమనాలీలో రొమాన్స్ ...

అల్లు అర్జున్ - తమన్నా కులుమనాలీలో రొమాన్స్ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ ఈ నెల 26 నుంచి ఓ రెండు నెలల పాటు కులుమనాలిలో వుండబోతున్నాడు. అయితే ఇదేదో హాలిడే ట్రిప్ అనుకునేరు. అతను వెళ్ళేది షూటింగ్ కోసమే. అల్లు అర్జున్, వివి వినాయక్ కలయికలో గీతాఆర్ట్స్ పతాకంపై గజనీ, మగధీర వంటి హ్యాట్రిక్ చిత్రాలందించిన అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కోసమే బన్ని కులుమనాలికి వెళుతున్నారు. అక్కడ వేసిన భారిసెట్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షేడ్యూల్ లో బన్నితో పాటు కధానాయిక తమన్నా కుడా పాల్గొంటున్నారు.

ఫిల్మిం నగర్ సమాచారం ప్రకారం మొదట ఈ సినిమాకి హాట్ హాట్ హన్సిక ప్రధాన కథానాయికగా చేస్తుందని సమాచారం వచ్చినప్పటికి, ప్రస్తుత సమాచారం ప్రకారం, హాపీ డేస్ తమన్నా ఎప్పికైందని సమాచారం. అందుకే కాబోలు సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే సౌత్ స్కోప్ పత్రికకు హాట్ హాట్ గా ఫోజులిచ్చిన బన్ని, తమన్నాల రోమాన్స్ ఈ చిత్రంలో ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu