»   » మీ ఊహకు కూడా అందదు : బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ వేదిక ఎక్కడో తెలుసా..??

మీ ఊహకు కూడా అందదు : బాహుబలి 2 ఆడియో ఫంక్షన్ వేదిక ఎక్కడో తెలుసా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌలి దర్శకత్వం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొంది౦చబడుతున్న చిత్రం 'బాహుబలి 2'.ఈ చిత్రం ఏప్రిల్ 28 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసిన విషయం మనకి తెలిసిందే.ఈ చిత్ర గ్రాఫిక్స్ వర్క్ డీలే కారణంగా ఈ చిత్ర ట్రైలర్ ని మార్చ్ లో రిలీజ్ చెయ్యాలని దర్శకుడు నిర్ణయించారు.

మరొకవైపు ఈ చిత్ర ఆడియో రిలీజ్ ని ఉగాది పండుగ రోజు రిలీజ్ చెయ్యలని నిర్ణయించారు. అయితే తొలి పార్ట్ ఆడియో తిరుపతిలో చేశారు.. అందుకే ఆ చిత్రం ఘన విజయం సాధించిందనీ.. రెండో పార్ట్ కూడా అక్కడే నిర్వహిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాతలకు సూచించారంట. అయితే ఇప్పుడు ఈ వేడుక కి వేదిక ఎక్కడ అన్నదీ తెలిసి పోయింది. అదెక్కడా అంటే

బాహుబలి 2 ఆడియో వేడుక ఎక్కడాఫ

బాహుబలి 2 ఆడియో వేడుక ఎక్కడాఫ

మొదట్లో అంతా బాహుబలి 2 ఆడియో వేడుక ఎక్కడా అన్న విశయం పై చర్చించుకుంటున్న సమయం లో కూడా దీనిపై దర్శకధీరుడు వెంటనే ఏమి స్పందించలేదు. సెంటిమెంట్ ని ఫాలో అవుతూ తిరుపతిలో చేయడానికి ఆసక్తి కనబరుస్తారా? చిత్రంపై నమ్మకంతో వైజాక్ లో చేయడానికి ఒకే చెబుతారా? అంటూనే ఎదురు చూసారు చాలామంది ఈ రెండు వేదికల్లోనే ఏదో ఒకటి ఓకే అయిపోతుందనుకున్నారు కూడా

అద్బుతమైన స్పాట్:

అద్బుతమైన స్పాట్:

ఈ విషయంపై జక్కన్న ఏం చెబుతాడా అని ఎదురు చూసారంతా. మొత్తానికి ఎవ్వరూ ఊహించలేని అద్బుతమైన స్పాట్ ని ఎంపిక చేసాడట రాజమౌళి. అసలు ఎవరూ ఊహించని ఆ వేదిక ఎక్కడో తెలిసిపోగానే చిత్ర బృందం అంతా ఆనందం లో మునిగిపోయింది.

మాహిష్మతీ రాజ్యం లోనే:

మాహిష్మతీ రాజ్యం లోనే:

అదీ ఎక్కడంటే మాహిష్మతీ రాజ్యం లోనే. షూటింగ్ ఎటూ అయిపోయింది కాబట్టి మరికొన్ని రోజుల్లో ఈ సెట్టింగులని తొలగించి వేస్తారు. ఆ లోగానే ఇన్నాళ్ళూ బయటి చీమను కూడా లోపలికి రానివ్వని జక్కన్న ఇప్పుడు మాహిష్మతీని అందరికీ చూపించాలనే ఆలోచన్లో ఉన్నాడట.

మార్చ్‌ 28న ఉగాది సందర్భంగా:

మార్చ్‌ 28న ఉగాది సందర్భంగా:

ఏప్రిల్‌ 28న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో.. దానికి ఓ నెల రోజుల ముందు మార్చ్‌ 28న ఉగాది సందర్భంగా ఆడియో వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్‌ వేశాడట. . రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆడియో ఫంక్ష‌న్ దాదాపుగా ఖాయం అయిపోయిన‌ట్టే.

ఇన్ సైడ్ టాక్:

ఇన్ సైడ్ టాక్:

ఇప్పటికే వాటికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ని చాలా రిచ్ గా తెరకెక్కించడమే కాక సినిమాను భారీగా ప్రమోట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య మాత్రం కనిపిస్తోంది.

రామోజీ ఫిలిం సిటీ మాత్రం ఖాయం:

రామోజీ ఫిలిం సిటీ మాత్రం ఖాయం:

ఫిల్మ్ సిటీ ఎంట్రీ గేట్‌ నుంచి మాషీష్మతీ సెట్ వ‌ర‌కూ క్రౌడ్ వెళ్ల‌డానికి క‌ష్టం అవుతుంద‌ని, అందుకే ఫిల్మ్ సిటీ ఎంట్రీ గేట్‌కి అతి ద‌గ్గ‌ర‌ల్లోనే ఆడియో ఫంక్ష‌న్ కోసం వేదిక సెట్ చేసే ప‌నిలో ఉన్నార‌ని కూడా అనుకుంటున్నారు. అంటే మొత్తానికి రామోజీ ఫిలిం సిటీ అన్నది మాత్రం ఖాయం అన్నమాట.

ఎక్కడైన ఓపెన్ ప్లేస్ లో:

ఎక్కడైన ఓపెన్ ప్లేస్ లో:

దాదాపు ఉగాది పండుగ సందర్భంగా ఈ పాటల పండుగ కార్యక్రమాన్ని జరిపే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక వేదిక విషయానికి వస్తే రామోజీ ఫిలిం సిటీలో వేసిన మాహిష్మతి సెట్ దగ్గర నిర్వహించాలా లేదంటే ఎక్కడైన ఓపెన్ ప్లేస్ లో నిర్వహించాలా అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

 థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌:

థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌:

మాహిష్మతీ రాజ్యం లోనే నా కాదా అన్నది మాత్రం ఇంకా ఖచ్చితంగా చెప్పలేం. ఆడియో విడుద‌ల‌కు ముందే ట్రైల‌ర్‌ని విడుద‌ల చేస్తారు. సినిమా రిలీజ్‌కీ ఆడియోకీ గ్యాప్ మ‌రీ ఎక్కువైపోయింద‌ని భావిస్తే గనుక‌... ఆడియో విడుద‌ల‌కు ముందు టీజ‌ర్‌తో స‌రిపెడ‌తారు. ఏప్రిల్ మొద‌టి, లేదా రెండో వారంలో థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేస్తారు.

English summary
Latest buzz roaming in Tollywood about Bahubali 2 That., the Audiyo launch will be at Mahishmati set inRamoji film city on 28 March
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu