»   » రోమాలు నిక్కబొడిచేలా... బాహుబలి 2 ప్రభాస్ పోస్టర్

రోమాలు నిక్కబొడిచేలా... బాహుబలి 2 ప్రభాస్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు, ప్ర‌పంచానికి తెలియ‌చెప్పిన సినిమా బాహుబ‌లి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి పార్ట్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ లో రెండోవ భాగం బాహుబలి: ది కంక్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేయగా.. విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉంది.

 Bahubali 2 Team released a poster With prabhas as Amarendra bahubali

సాధారణ చిత్రాలకైతే ఇది ఎక్కువే కానీ.. పూర్తిగా గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ బాహుబలి2కి ఇది తక్కువ సమయమే. ఇదే టైంలో ప్రమోషన్స్ ను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు సినీ చరిత్రకు కొత్త రికార్డులను పరిచయం చేసి కొత్త దిశను చూపిన చిత్రం బాహుబలి. అందులో ఎలాంటి సందేహం లేదనేది సినీ అభిమానులు, విశ్లేషకుల మాట. తెలుగు సినిమాకు అసలైన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూపించాడు సినిమా జక్కన్న రాజమౌళి. బాహుబలి సినిమాతో కొత్త రికార్డులను రుచి చూపించాడు జక్కన్న. ఇప్పుడు అదే ఉత్సాహంతో బాహుబలి-2ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.


ఈ సినిమాపై ఎన్నెన్నో అంచనాలున్నాయి. బాహుబలి సినిమానే అలా ఉంటే.. ఆ సినిమా ఇంకా ఎలా ఉండాలి? ఏ రేంజ్‌లో ఉండాలి? అందుకే రెండున్నరేళ్లు కష్టపడ్డాడు జక్కన్న, అతడి టీమ్. సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయమూ బయటకు రాకుండా అత్యంత పకడ్బందీగా తెరకెక్కించాడు.


 Bahubali 2 Team released a poster With prabhas as Amarendra bahubali

ఇప్పుడు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటోంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందే ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన రాజమౌళి, తాజాగా ప్రభాస్, బాహుబలి అభిమానులకు కనులవిందు చేయబోతున్నాడు. బాహుబలి-2 రెండో పోస్టర్ ని కూడా రిలీజ్ చేసాడు , జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభాస్, అనుష్క ఇద్దరు కలిసి విల్లు ఎక్కుపెట్టిన ఫొటోను రాజమౌళి విడుదల చేశాడు. ఆ ఫొటో విజువల్‌గా సూపర్‌గా ఉంది. అయితే అందులో చిన్న మిస్టేక్ కూడా పెద్ద సంచలనమే రేపి బాహుబలి మీద ఎంత ఆసక్తితో ఉన్నారో, ప్రతీవిషయాన్ని జనం ఎంత పక్కాగా చూస్తున్నారో అర్థమయ్యింది.ఈ రోజు మహా శివరత్రి పర్వ దినం సంధర్భంగా కూడా బాహుబలి టీమ్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఏనుగు తలపై ప్రభాస్ నిల్చోని ఉన్న ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది. సాహోరే బాహుబలి.. హ్యాపీ మహా శివరాత్రి అంటూ దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. గజేంద్రుడి తొండంపై ఓ కాలు.. తలపై మరో కాలు ఉంచి.. ప్రభాస్ తీక్షణంగా చూస్తున్న లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బాహుబలి.. బహు భాషా చిత్రం కావడంతో తమిళంలోనూ ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా బాహుబలి గ్రీటింగ్ కార్డును రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Bahubali 2 Team released a poster With prabhas as Amarendra bahubali Today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu