»   » బాహుబలి రీమిక్స్ : అవతార్ వెర్షన్, బాలయ్య వెర్షన్ (వీడియోస్)

బాహుబలి రీమిక్స్ : అవతార్ వెర్షన్, బాలయ్య వెర్షన్ (వీడియోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం యావత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.... బాహుబలి ట్రైలర్ విడుదలైనప్పటి నుండి పలు రీమిక్స్ ట్రైలర్లు కూడా యూట్యూబులో హల్ చల్ చేస్తున్నాయి. అవతార్ రీమిక్స్ బాహుబలి ట్రైలర్ తో పాటు, బాలయ్య వెర్షన్ బాహుబలి ట్రైలర్ కూడా నెట్లో హడావుడి చేస్తోంది. బాలయ్య అభిమానులు సైతం బాలయ్య వెర్షన్ బాహుబలి ట్రైలర్ చూసి సూపర్బ్ అంటున్నారు. లెజెండ్ మూవీలోని విజువల్స్ తో బాహుబలి ట్రైలర్ ఆడియో ట్రాక్ దీన్ని రీమిక్స్ చేసారు. మరి ఆ వీడియలపై మీరూ ఓ లక్కేయండి.


బాలయ్య వెర్షన్ బాహుబలి ట్రైలర్బాహుబలి ట్రైలర్ అవతార్ రీమిక్స్బాహుబలి సినిమా విషయానికొస్తే...
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' ఆడియో లాంచ్ తేదీ, వేదిక ఖరారైంది. ఈ చిత్ర ఆడియో వేడుక తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో ఈ వేడుక ప్లాన్ చేసారు. వాస్తవానికి ఈ ఆడియో వేడుక మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్‌లో జరుగాల్సి ఉంది. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా ఆడియో వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక వాయిదా వేసి అభిమానులకు కారణం వివరించి క్షమాపణలు చెప్పారు రాజమౌళి, ప్రభాస్.


చివరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్ లో ఆడియో వేడుక ప్లాన్ చేసారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి లభించడంతో ఏర్పాట్లు ప్రారంభించారు. ‘బాహుబలి' ఆడియో వేడుకలో ఎలాంటి సమస్య ఏర్పడకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు దగ్గరగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రం. 250 కోట్ల ఖర్చుతో...రెండు భాగాలుగా తెరకెక్కుతోది. తొలి భాగం జులై 10న ‘బాహుబలి - ది బిగినింగ్' పేరుతో తెరకెక్కుతుంది. రెండో భాగం 2016లో విడుదల కానుంది.

English summary
Bahubali and Avatar Remix Trailer released.
Please Wait while comments are loading...