twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేన్స్‌ ఫిలిం ఫెస్ట్ లో బాహుబలి స్క్రీనింగ్ తేదీ

    |

    దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా "బాహుబలి" చిత్రం ఎలాంటి పేరును సంపాదించుకుందో తెలిసిందే . ఇప్పుడు బాహుబలి కి మరో అరుదైన గౌరవం లభించింది . ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ చేయగా యస్‌.యస్‌. రాజమౌళి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఇటీవ‌ల జ‌రిగిన‌ 63వ జాతీయ చ‌ల‌న చిత్రాత్స‌వాల్లో అవార్డును ద‌క్కించుకుంది.

    ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఈ సినిమా అంతర్జాతీయండా విడుదలైంది. తాజాగా కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫిల్మ్‌ మార్కెంటింగ్‌కు సంబంధించిన అంశంలో "బాహుబలి" పాలుపంచుకోబోతోంది.మే 11 నుంచి 22 వర‌కూ జ‌రిగే ఫెస్టివ‌ల్ లో 16వ తేదిన సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఓ తెలుగు సినిమా విదేశీ భాష‌ల సినిమాల‌తో పోటీ ప‌డటం తొలిసారి.

    Bahubali At Cannes Film Festival

    కేన్స్‌కు అనుబంద సంస్థ అయిన "మార్చ్ ఎ డు ఫిల్మ్‌" (Marché du Film ఫిల్మ్‌ మార్కెట్‌) లో ఈ నెల 16న వర్చువల్‌ రియాలిటీ అంశంపై "ఇంక్రీజింగ్‌ ది ఇంటెన్సిటీ అండ్‌ స్కేల్‌ ఆఫ్‌ ఎపిక్‌ ఫిల్మ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ త్రూ వీఆర్‌" అనే చర్చ జరగనుండగా, దానికి "బాహుబలి" దర్శక నిర్మాతలు రాజమౌళి, శోభు యార్లగడ్డ, రేడియాన టెక్నాలజీ గ్రూప్‌ (ఆర్‌టీజీ) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజా కోడూరి పాల్గొననున్నారు.

    వర్చువల్‌ రియాలిటీ ద్వారా ఓ కథకుడికి ఎలాంటి కొత్త అవకాశాలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి, ఆ తరహా చిత్రాల నిర్మాణంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి, మాస్‌ ఆడియెన్స్ కు ఈ అనుభవాలు చేరాలంటే కొత్తగా ఎలాంటి పంపిణీ వ్యవహారాలు చేపట్టాలి వంటి అంశాల్ని ఇందులో చర్చిస్తారు.

    చర్చ పూర్తయ్యాక అదే రోజు రాత్రి "మార్చె డు ఫిల్మ్‌" వేదిక వద్ద "బాహుబలి - ద బిగినింగ్‌"ను ప్రదర్శించ నున్నారు..

    English summary
    Bahubali at the world's most reputed film event, the Cannes Film Festival in France.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X