»   » హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి' సినిమా రెండవ భాగంతో సమాప్తమవుతుంది. అయితే, ఆ తరువాత కూడా 'బాహుబలి' ఉంటుందనీ .. అది సరికొత్త రూపంలో ఉంటుందని రాజమౌళి ఆ మధ్య చెప్పాడు. ఆయన మాటకి అర్థమేమిటనేది తాజాగా అందిన ఒక సమాచారం వలన తెలుస్తోంది. రాజమౌళి 'బాహుబలి' సినిమా కామిక్ బుక్స్ రూపంలో రాబోతోంది. పిల్లలను ఆకట్టుకొనే బొమ్మల కథతో కూడిన కామిక్ బుక్స్ త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి.

సాధారణంగా ఈ తరహా ప్రక్రియ హాలీవుడ్ సినిమాల విషయంలో జరుగుతూ వుంటుంది. అది ఈ మధ్య బాలీవుడ్ ని కూడా ప్రభావితం చేసి, 'బాహుబలి'తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. 'బాహుబలి' కథ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరువకావాలనే ఉద్దేశంతో, గ్రాఫిక్స్ ఇండియావారితో కలిసి ఈ సినిమా టీమ్ కామిక్ బుక్స్ ను లాంచ్ చేయనుంది.బాలల ప్రపంచానికి మరో కామిక్ హీరోని పరిచయం చేస్తున్న ఈ ప్రయత్నం గురించి మరిన్ని విశేషాలు


జక్కన్న అండ్ టీం:

జక్కన్న అండ్ టీం:

బాహుబలి సంచలనాలు అంచనాలకు మించి నమోదు కావడం.. బోలెడన్ని మార్కెటింగ్ ద్వారాలను తెరిచేసింది. అందుకే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి బోలెడన్ని రూట్ లు ఫాలో అయిపోబోతున్నారు జక్కన్న అండ్ టీం. అయితే.. రెండో భాగం రిలీజ్ కి ముందు అన్ని మార్గాలను వాడేస్తే.. జనాల్లో ఉన్న హైప్ తగ్గిపోయి.. అసలుకే ఎసరు వస్తుందనే ఉద్దేశ్యంతో నెమ్మదించారు కానీ.. కామిక్ బుక్స్ విషయంలో మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు.


వీడియో గేమ్స్:

వీడియో గేమ్స్:

ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కొత్త యాప్స్ .. వీడియో గేమ్స్ కూడా మార్కెట్లోకి రానున్నట్టు చెబుతున్నారు.తాజాగా ఈ సినిమాకి కామిక్ బుక్స్ రాబోతున్నాది. పిల్లలను ఆకట్టుకునే బొమ్మల స్టొరీతో కూడిన కామిక్ బుక్ మార్కెట్ లోకి రాబోతుంది. అందుకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేశాడు రాజమౌళి. ఈ తరహా ప్రక్రియ హాలీవుడ్ సినిమాల విషయంలో ఎక్కువగా చూస్తుంటాం.


నవలలు కూడా :

నవలలు కూడా :

అది ఈమధ్య బాలీవుడ్ ని కూడా ప్రభావితం చేసి, బాహుబలి తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరువకావాలనే ఉద్దేశంతో, గ్రాఫికస్ ఇండియావారితో కలిసి సినిమా టీమ్ కామిక్ బుక్స్ ను లాంచ్ చేయనుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కొత్త యాప్స్, వీడియో గేమ్స్, నవలలు కూడా మార్కెట్లోకి రానున్నట్టు చెబుతున్నారు.


బాహుబలి కామిక్ బుక్స్:

బాహుబలి కామిక్ బుక్స్:

బాహుబలి టీం గ్రాఫిక్స్ ఇండియా వారితో కలిసి బాహుబలి కథని యూనివర్సల్ గా అందరికీ చేరువ చేయాలని, బాహుబలి కామిక్ బుక్స్ ని లాంచ్ చేయనున్నారు. ఇటీవలే గ్రాఫిక్స్ ఇండియా వారితో చర్చలు ఫలించడంతో వారు ప్రస్తుతం కామిక్ బుక్స్ ని సిద్దం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ‘బాహుబలి యూనివర్స్ ని పరిచయం చేయడం కోసం


సినిమాలో లిమిటేషన్స్ ఉంటాయి:

సినిమాలో లిమిటేషన్స్ ఉంటాయి:

బాహుబలి కామిక్స్, యానిమేషన్ గేమ్స్ ని రిలీజ్ చేయనున్నాం. దీని కోసం గ్రాఫిక్స్ ఇండియా వారితో కలిసి పనిచేయనున్నామని' బాహుబలి టీం తెలిపింది. సినిమాలో అంటే లిమిటేషన్స్ ఉంటాయి. కానీ పుస్తకంలో అయితే క్రియేటివిటీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదు. బెంగళూరులో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్లో.. 'బాహుబలి: బ్యాటిల్ ఆఫ్ స్వోర్డ్' అనే పేరుతో కామిక్ బుక్ ని రిలీజ్ చేశారు.


విలన్స్:

విలన్స్:

ఇందులో బాహుబలి.. భల్లాలదేవులతో పాటు.. మాహిష్మతిలో ఉండే ఇతర కేరక్టర్స్ దాదాపు మనకు తెలిసినవే. అయితే.. మాహిష్మతిని ఎదిరించే విలన్స్ ను మాత్రం బోలెడంతమందిని పట్టుకొచ్చారు. పర్షియా.. హిమాంషి.. మంగోలియా.. నోర్స్ ల్యాండ్స్.. కాంగో.. ఇలా రకరకాల ప్రాంతాల నుంచి విలన్స్ వచ్చి మాహిష్మతిని ఎదిరించేస్తుంటారు.


చోటాభీం, శక్తిమాన్, హీ మాన్ లాగా:

చోటాభీం, శక్తిమాన్, హీ మాన్ లాగా:

ఇది.. కామిక్ సిరీస్ కావడంతో సినిమాకి.. కామిక్ బుక్ లో స్టోరీకి సంబంధం ఉండదట. అంటే చోటాభీం, శక్తిమాన్, హీ మాన్ లాగా బాహుబలి కూడా ఒక కామిక్ హీరో అయిపోతాడన్నమాట. అదే గనక జరిగితే ఇక రాజమౌళీ, ప్రభాస్, రాణా... ఇంకా ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులందరూ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలలకు బాహుబలి సూపర్ హీరో అయిపోతాడు..


ప్ర‌తీ స‌న్నివేశం:

ప్ర‌తీ స‌న్నివేశం:

బాహుబ‌లి చిత్రం లోని ప్ర‌తీ స‌న్నివేశం.. ప్రింటు రూపంలో అచ్చు వేసి విడుదల చేసారు. దానికి ‘బాహుబ‌లి - బాటిల్ ఆఫ్ ది బోల్డ్‌' అనే పేరు పెట్టారు. బాహుబ‌లి, భ‌ళ్లాల‌దేవ‌, క‌ట్ట‌ప్ప‌, శివ‌గామి ఈ పాత్ర‌ల‌న్నీ కామిక్ పాత్ర‌ల రూపం సంత‌రించుకొన్నాయి. ఈ యానిమేష‌న్ల‌ను గ్రాఫిక్ ఇండియా సంస్థ రూపొందించింది.


ఆర్కా మీడియా వర్క్స్‌:

ఆర్కా మీడియా వర్క్స్‌:

బెంగళూరులో జరుగుతున్న కామిక్‌ కాన్‌లో ఆ పుస్తకానికి సంబంధించిన కవర్‌ పేజీతో పాటు, ముందస్తు పేజీలు కొన్ని విడుదల చేశారు. బాహుబలి సినిమాతోనూ, కథతోనూ సంబంధం లేకుండా... బాహుబలి, భల్లాలదేవ పెద్దవాళ్లుగా ఎదిగే క్రమంలో జరిగే సంఘటనలతో ఈ కామిక్‌ పుస్తకాల్ని తీర్చిదిద్దినట్టు తెలిసింది. ‘బాహుబలి' చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్‌తో కలిసి గ్రాఫిక్‌ ఇండియా సంస్థ ఈ పుస్తకాన్ని రూపొందిస్తోంది.


సినిమాపై అంచనాలు:

సినిమాపై అంచనాలు:

బాహుబలి: ది బిగినింగ్‌' కోసం సృష్టించిన మహిష్మతి రాజ్యం సినిమాతోనే కాకుండా పలు రూపాల్లో ప్రేక్షకుల్ని అలరించటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు. యానిమేషన్‌, వర్చువల్‌ రియాలిటీ, కామిక్‌, మర్చండైజ్‌... ఇలా రకరకాల రూపాల్లో మహిష్మతి రాజ్యం, ‘బాహుబలి' చిత్రంలోని పాత్రలు దర్శనమిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతూ వస్తున్నాయి.


బ్యాటిల్‌ ఆఫ్‌ ది బోల్డ్‌:

బ్యాటిల్‌ ఆఫ్‌ ది బోల్డ్‌:

మరీ ముఖ్యంగా ఇటీవలే విడుదలైన వర్చువల్‌ రియాలిటీ వీడియో ప్రేక్షకులకి కొత్త రకమైన అనుభూతిని పంచింది. త్వరలోనే ‘బాహుబలి - బ్యాటిల్‌ ఆఫ్‌ ది బోల్డ్‌' పేరుతో కామిక్‌ బుక్‌ కూడా విడుదల కాబోతూండటంతో పిల్లలంతా కూడా ఈ సినిమా రెండో పార్ట్ కోసం ఎదురుచూస్తారనటంలో సందేహం లేదు.


English summary
The makers are opting different promotional strategies similar to Hollywood and today the makers had officially announced comic book which was related to Baahubali. It will be showcasing the world in its full glory and wildest imagination.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu