twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక చీమకి కూడా ప్రవేశం లేదు... రాజమౌళి సెక్యూరిటీ పెంచాడు...

    బాహుబలి లీకేజ్ సంఘటనతో అలర్ట్ అయిన రాజమౌళి సెక్యూరిటీ పెంచేసాడట. లీకేజీ జరిగేది ఎడిటింగ్ టేబుల్ మీదే కనుక అక్కడ తనకి నమ్మకస్తులైన వారిని నియమించాడట. అలాగే సిసిటీవీ కెమెరాలు కూడా గ్రాఫిక్స్ వర్క్ జరిగే

    |

    బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన పేరు రాజమౌళి. ఆ సినిమా కలిగించిన సంచలనం ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడు చిత్రపరిశ్రమలో ఎవరయినా సరే సినిమా నిర్మాణంలో తన ప్రతిభ, దార్శనికత పట్ల అత్యంత గౌరవం ప్రదర్సిస్తున్నారు. ఒక్కమాట తమ సినిమా గురించి అతడి నోటివెంబడి వస్తే అదే చాలు అనుకుంటున్నంత రేంజిలో ఆయన స్థాయి పెరిగిపోయింది.

    అంతటి పేరు బాహుబలి వల్లే వచ్చిందనటం లో అతిసయోక్తి లేదు... బాహు బలికి ముందు కేవలం టాలీవుడ్ వరకే అనుకున్న రాజమౌళి ఒక్క దెబ్బతో ప్రపంచ సినీ ఇండస్ట్రీలన్నిటికీ కనిపించాడు. 'బాహుబలి'కి సీక్వెల్ గా వస్తోంది 'బాహుబలి 2'. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన రెండు నిముషాల ఇరవై సెకండ్స్ వార్ సీక్వెన్స్ క్లిప్ ఒకటి బయిటకు వచ్చిందన్న వార్త ఒక్కసారిగా కల కలం రేపింది. ఇప్పటికే మొదటి భాగం లోని సీన్ల విషయం లో ఇలాగే జరిగింది.

    Bahubali Effect Rajamouli Hires Security

    'బాహుబలి' మొదటి భాగానికి సంబంధించి వీడియో క్లిప్ బయటకి వచ్చినప్పుడు రాజమౌళి, అతని బృందం చాలా గాబరా పడ్డారు. అయితే రెండో భాగం తీస్తున్నప్పుడు అయినా జాగ్రత్త పడలేదు. సినిమాలోని అతి కీలకమైన సన్నివేశాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయ్యేసరికి రాజమౌళికి . ఇక ఈ వీడియో క్లిప్, ఓ రా ఫుటేజ్ అని, ఎడిటింగ్, డి ఐ గట్రా చేయని, కెమెరా లో షూట్ చేసిన వార్ సీక్వెన్స్ అని చెప్తున్నారు. అందులో అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య వచ్చే సీన్స్ తో కలిపి ఈ ఫుటేజ్ బయిటకువచ్చింది. ఈ వీడియో చూసిన వాళ్లు ట్విట్టర్ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ అదరకొట్టాడని, అనుష్క అదిరిపోయిందంటూ కామెంట్స్ చేసారు.

    ఇక బాహుబలి 2 కి చెందిన డిజిటల్ టీమ్ ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఎక్కడ నుంచి ఈ వీడియో మొదలైందో తెలుసుకునే సైబర్ క్రైమ్ పోలీసులు దొంగని పట్టేసారు . ఏదైమైనా ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టం. గతంలోనూ బాహుబలి చిత్రం వార్ సీక్వెన్స్ లీక్ అయ్యి, పెద్ద వివాదం జరిగింది. బయటకి లీక్ అయిన దానికంటే ఇంకా లీక్ చేయనిది వాళ్ల దగ్గర ఎంత ఫుటేజీ వుందోనని రాజమౌళి తెగ వర్రీ అయిపోయాడు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బిజినెస్ చేస్తోన్న ఈ చిత్రానికి పైరసీ రూపంలో ఆటంకం ఎదురు కాకూడదు. ఇలాంటి వీడియోల వల్ల సినిమాకి నష్టం జరగడంతో పాటు సినిమాపై జనంలో వున్న ఆసక్తి సన్నగిల్లిపోతుంది. అందుకే అన్ని పనులూ మానేసి ఈ వీడియో లీక్ చేసిందెవరో కనిపెట్టే పనిలో మునిగి మొత్తానికి ఇంటి దొంగని పట్టేసారు.

    అతని వద్ద వున్న ఫుటేజీ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సంఘటనతో అలర్ట్ అయిన రాజమౌళి సెక్యూరిటీ పెంచేసాడట. లీకేజీ జరిగేది ఎడిటింగ్ టేబుల్ మీదే కనుక అక్కడ తనకి నమ్మకస్తులైన వారిని నియమించాడట. అలాగే సిసిటీవీ కెమెరాలు కూడా గ్రాఫిక్స్ వర్క్ జరిగే చోట్ల అడుగడుగునా ఏర్పాటు చేస్తున్నారట. టెక్నాలజీని విపరీతంగా అడ్డదార్లకి వాడేస్తోన్న ఈ రోజుల్లో భారీ సినిమాల విషయంలో అలసత్వం ఏమాత్రం పని చేయదు. ఎవడో చేసే తింగరి పని వల్ల కోట్లకి కోట్లు బూడిదలో కలిసిపోయే ప్రమాదం వుంటుంది మరి.

    English summary
    nine-minute long scene from Baahubali 2 has been leaked online. A graphic designer has been arrested for the leak, which is said to be a part of the film's climax and is crucial to the film so Rajamouli Hires Security for editing table
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X