»   » బాహుబలి: బెంగళూరు పైరసీ భూతంపై పోలీసుల నిఘా

బాహుబలి: బెంగళూరు పైరసీ భూతంపై పోలీసుల నిఘా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: బాహుబలి సినిమా పైరసిని అడ్డుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాను గుట్టు చప్పుడు కాకుండ పైరసి సీడీలు తయారు చేసి సరఫరా చెయ్యడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా పైరసి సీడీలు తయారు చేసి సరఫరా చెయ్యడంలో బెంగళూరు నగరం ముందు వరసలో ఉంటుదని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కొన్ని రోజుల క్రితం బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆ సినిమా నిర్మాతలు బెంగళూరు పోలీసులను సంప్రదించారు.


Bahubali piracy cd’s, Bangalore Police search SP road on Friday

బాహుబలి పైరసిని అరికట్టడానికి సహకరించాలని బెంగళూరు నగర పోలీసులకు మనవి చేశారు. బెంగళూరు పోలీసులు ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పైరసి సీడీలకు కేంద్ర బిందువు అయిన ఎస్ పీ రోడ్డులో శుక్రవారం సీసీబీ పోలీసులు మఫ్టీలో పలు షాప్ లకు వెళ్లారు.


బాహుబలి సీడీలు ఉన్నాయా అని ఆరా తీసి పరిశీలించారు. బెంగళూరులో ఏ సినిమా అయినా మొదటి షో అయిన వెంటనే కొన్ని గంటల లోనే పైరసీ సీడీలు బయటకు వస్తాయి. దేశంలోని అనేక ప్రాంతాలకు ఇక్కడి నుండే పైరసీ సీడీలు సరఫరా చేస్తారు. అంతటి హై టెక్నాలజీ సమకూర్చుకున్న పైరసి మాఫియాపై బెంగళూరు పోలీసులు గట్టి నిఘా వేశారు.

English summary
Bahubali piracy cd’s, Bangalore Police search SP road on Friday
Please Wait while comments are loading...