బాహుబలి2 : కళ్ళు తిరిగిపోయే ఫంక్షన్, ట్రైలర్ వేడుక కాకుండా ఇంకో సంబరం
ఒక వైపున 'బాహుబలి 2' సినిమా ట్రైలర్ సన్నాహాలు జరుగుతూ వుంటే, మరో వైపున ఈ సినిమా విడుదలకి ముందు జరగవలసిన ఫంక్షన్ కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాజమౌలి దర్శకత్వం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొంది౦చబడుతున్న చిత్రం 'బాహుబలి 2'.ఈ చిత్రం ఏప్రిల్ 28 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసిన విషయం మనకి తెలిసిందే.ఈ చిత్ర గ్రాఫిక్స్ వర్క్ డీలే కారణంగా ఈ చిత్ర ట్రైలర్ ని మార్చ్ లో రిలీజ్ చెయ్యాలని దర్శకుడు నిర్ణయించారు. మరొకవైపు ఈ చిత్ర ఆడియో రిలీజ్ ని ఉగాది పండుగ రోజు రిలీజ్ చెయ్యలని నిర్ణయించారు. అయితే తొలి పార్ట్ ఆడియో తిరుపతిలో చేశారు.. అందుకే ఆ చిత్రం ఘన విజయం సాధించిందనీ..
రెండో పార్ట్ కూడా అక్కడే నిర్వహిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాతలకు సూచించారంట. అయితే ఇప్పుడు ఈ వేడుక కి వేదిక ఎక్కడ అన్నదీ తెలిసి పోయింది. అదెక్కడా అంటే మాహిష్మతీ రాజ్యం లోనే. షూటింగ్ ఎటూ అయిపోయింది కాబట్టి మరికొన్ని రోజుల్లో ఈ సెట్టింగులని తొలగించి వేస్తారు. ఆ లోగానే ఇన్నాళ్ళూ బయటి చీమను కూడా లోపలికి రానివ్వని జక్కన్న ఇప్పుడు మాహిష్మతీని అందరికీ చూపించాలనే ఆలోచన్లో ఉన్నాడట.

ఒక వైపున 'బాహుబలి 2' సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సన్నాహాలు జరుగుతూ వుంటే, మరో వైపున ఈ సినిమా విడుదలకి ముందు జరగవలసిన ఫంక్షన్ కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఈ నెల 15వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ కి తుది మెరుగులు దిద్దుతున్నారని అంటున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీస్థాయిలో ఒక వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన మైదానంలో, పది వేలమంది కూర్చునేలా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ వేడుకకి రామోజీరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











