twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' గురించి నిర్మాత

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్‌తో ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించబోతున్న భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ జూలై 6న ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడారు.

    శోభు యార్లగడ్డ మాట్లాడుతూ "దాదాపు ఏడాది పాటు చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత జూలై 6న 'బాహుబలి' షూటింగ్ మొదలు పెట్టబోతున్నందుకు ఎంతో ఉద్వేగంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజమౌళి అన్ని విధాలా సమాయత్తమయ్యారు'' అని తెలిపారు.

    ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌ హీరోగా నటించబోతున్నారు. అనుష్క, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకు వచ్చే నెల 6న కొబ్బరికాయ కొట్టి చిత్రీకరణకు శ్రీకారం చుడతారు.

    గతేడాది సరిగ్గా అదే రోజున 'ఈగ' సినిమా తెరపైకి వచ్చింది. 'బాహుబలి'ని ఐమాక్స్‌ కెమెరాతో చిత్రించబోతున్నారనే విషయాన్ని దర్శకుడు ఖండించారు. ఈ సినిమాను ఆరీ అలెక్సా ఎక్స్‌టీ అనే కెమెరాతో తెరకెక్కిస్తామని తెలిపారు. అలాగే చిత్రీకరణకు అయ్యే వ్యయం గురించి వస్తున్న వార్తల్నీ తోసిపుచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో 'బాహుబలి' రూపొందుతుంది. చిత్రాన్ని హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తారు.

    English summary
    
 S S Rajamouli's magnum opus Baahubali has garnered lots of interest since its inception. The movie was in its pre-production stage so far. Rajamouli has now announced on a social media that the film will start shoot from the 6th of July. A year ago, Eega was released on the same day. Starring Prabhas, Anushka Shetty and Rana Daggubati in the lead, Baahubali is to be shot on a huge budget.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X