»   » రయీస్, కాబిల్, రోబో... అన్నిటికంటే ఎదురుచూసే సినిమా బాహుబలి: ఇదే ఆ సర్వే రిపోర్ట్

రయీస్, కాబిల్, రోబో... అన్నిటికంటే ఎదురుచూసే సినిమా బాహుబలి: ఇదే ఆ సర్వే రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి మూడేళ్ల పాటు శ్రమించింది. ఒక 'చందమామ కథ' రెండొందల కోట్ల వ్యయంతో దృశ్యరూపం దాల్చింది. ఆ దర్శకుడి స్వప్నం, ఆ బృందం పడ్డ కష్టం, ఆ నిర్మాతలు పడ్డ ఇష్టం దానిపై అంచనాలు పెంచింది. తెలుగు సినిమా కలలో కూడా ఊహించడానికి సాహసం చెయ్యలేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా మరో రికార్డ్ తో మళ్లీ తెరమీదికి వచ్చింది . తాజాగా ఒర్మాస్ మీడియా వారు ఒక సర్వేను నిర్వహించారు. ప్రేక్షకులు వచ్చే ఏడాది ఏ సినిమాను చూడటానికి ఎక్కువ ఆసక్తిగా వున్నారు? అనే విషయంపై ఈ సర్వే కొనసాగింది.

ఈ సర్వేలో భాగంగా కొన్ని సినిమాల జాబితాను ప్రజల ముందుంచారు. ఈ సర్వేలో 'బాహుబలి 2'కి మొదటిస్థానం లభించడం,. ఇందులో 51 శాతం మంది 'బాహుబ‌లిః ది కంక్లూజ‌న్‌'కే ఓటు వేసారు. షారుఖ్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్ సినిమాలు 'ది కంక్లూజ‌న్‌'కు ద‌రిదాపుల్లోనూ లేక‌పోవ‌డం విశేషం. అసలు బహుబలి 2 ఏ రేంజిలో ఆసక్తిని జనాల్లో నింపిందీ అన్నది తెలుసుకోవటానికి ఈ ఒక్క విషయం చాలు ఇంతకీ ఆ సర్వే వివరాలూ... బాహుబలి: ది కంక్లూజన్ విశేషాలూ ఇక్కడ చూస్తే

 రాయీస్ రెండో స్థానంలో:

రాయీస్ రెండో స్థానంలో:


జ‌న‌వ‌రి 25న రాబోతున్న షారుఖ్ మూవీ ‘రాయీస్' 21 శాతం ఓట్ల‌తో రెండో స్థానంలో నిలిచింది. అజ‌య్ దేవ‌గ‌ణ్-రోహిత్ శెట్టిల ‘గోల్ మాల్‌ 4 14 శాతం ఓట్ల‌తో మూడో స్థానం సంపాదించింది. స‌ల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్' 6 శాతం ఓట్ల‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఆశ్చ‌ర్య‌క‌రంగా రోబో సీక్వెల్ ‘2.0'కు 2 శాతం ఓట్లు మాత్ర‌మే ద‌క్కాయి.

 51 శాతం ఓట్లు : '

51 శాతం ఓట్లు : '


ఆమాత్రం ఓట్ల‌తోనే అది బాలీవుడ్ సినిమాల్ని వెన‌క్కి నెట్టి ఐదో స్థానం ద‌క్కించుకుంది. మిగ‌తా సినిమాల‌న్నింటికీ క‌లిపి 3 శాతం ఓట్లే ప‌డ్డాయి. ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్' ఒక్క‌టే 51 శాతం ఓట్లు సాధించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. దీన్ని బ‌ట్టే ఈ సినిమాపై హిందీ ప్రేక్ష‌కుల్లో ఏ స్థాయిలో అంచ‌నాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

 రెండవ భాగంలో :

రెండవ భాగంలో :


బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపవలసి వచ్చింది? అనే సస్పెన్స్ ను రెండవ భాగంలో రివీల్ చేయనున్నారు. ఈ ఒక్క సస్పెన్స్ సినిమా మొత్తానికీ కీలకం కావటమూ, భారీ నిర్మాణ విలువలూ బాహుబలి కోసం అందరూ ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఇకపోతే.. బాహుబలి 2లో ఆసక్తికర సన్నివేశాలుంటాయని, అనుష్క రానాల మధ్య వార్ సన్నివేశాలు, రమ్యకృష్ణ అనుష్కల మధ్య అత్తాకోడళ్ల జగడాలతో పాటు రొమాన్స్ సన్నివేశాలకు సైతం ఎలాంటి లోటుండదని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.

 5 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు:

5 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు:


ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కోసం వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టుల్ని వాడిన జక్కన్న.. 'కంక్లూజన్‌' క్లైమాక్స్ మాత్రం ఏకంగా 5 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య ప్లాన్ చేస్తున్నాడట. అంటే బాహుబలి 1 క్లైమాక్స్ కంటే సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ఎంత భారీగా ఉంటుందో ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు. ఆర్టిస్టుల విషయంలోనే కాదు.. మిగతా ఏ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదట మేకర్స్.

 ఏకంగా150 కోట్లకు పైగా బడ్జెట్‌తో:

ఏకంగా150 కోట్లకు పైగా బడ్జెట్‌తో:


ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బాహుబలి 2 క్లైమాక్స్‌ ఉంటుందని సమాచారం. నిజానికి మూడేళ్ల ముందు వరకు టాలీవుడ్లో భారీ బడ్జెట్‌ సినిమా అంటే రూ.50 కోట్లకు అటు ఇటు అంతే. అలాంటిది రాజమౌళి అండ్‌ కో ఏకంగా150 కోట్లకు పైగా బడ్జెట్‌తో 'బాహుబలి' సినిమా తీసి ఓ ట్రెండ్ సెట్ చేసింది. అసలు ట్రెండ్ అనడం కన్నా సాహసం అనడం కరెక్ట్.

 600 కోట్ల కలెక్షన్లు :

600 కోట్ల కలెక్షన్లు :


ఎంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేసినా.. కొన్ని మినిమమ్ గ్యారంటీ కూడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి .. అలాంటిది ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేసి అంతకు 4 రెట్లు కలెక్షన్లు రాబట్టారు. బాహుబలి కి స్పెండ్ చేసిన మనీలో ప్రతి పైసా విజువల్ గా కనిపిస్తూనే ఉంటుంది. 150 కోట్లతో తెరకెక్కిన సినిమా టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచేసి ఏకంగా 600 కోట్ల కలెక్షన్లు సాధించింది.

 బాగా ఖర్చుపెడుతున్నారు:

బాగా ఖర్చుపెడుతున్నారు:


రీమేక్ రైట్స్ లో కూడా రికార్డులు సృష్టించింది. తమిళ్ లోబాహుబ‌లి తొలి భాగాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ‌తో క‌లిసి యూవీ క్రియేష‌న్స్ త‌మిళ్‌లో రిలీజ్ చేసింది. బాహుబ‌లి తొలి పార్ట్ అక్క‌డ రూ.28 కోట్ల‌కు అమ్మితే రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి బిజినెస్ అలాంటిది మరి. ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ తో సెకండ్ పార్ట్ కి కూడా బాగా ఖర్చుపెడుతున్నారు.

 నెక్ట్స్ ఇయర్ రిలీజ్ :

నెక్ట్స్ ఇయర్ రిలీజ్ :


ఓన్లీ క్లైమాక్స్ కే 30 కోట్లు పెట్టినా.. అంతకు అంత కాదు.. అంతకు మించి ప్రాఫిట్ ని తెచ్చిపెట్టగల కెపాసిటీ ఉందంటున్నారు దర్శక నిర్మాతలు . అందుకే క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా.. అధ్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో మరో విజువల్ వండర్ ని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చెయ్యడానికి కష్టపడుతున్నారట యూనిట్.

English summary
In a survey conducted by Ormax Media over the month of November 2016, regular Bollywood theatre-goers were asked to pick their most-awaited film of 2017 from a list provided to them. A staggering 51% picked Bahubali’s second instalment
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu