twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి దయ.. ఆ ఒక్క సినిమాతో అప్పులన్ని తీర్చేశాను: బాహుబలి విలన్ కాలకేయ

    |

    సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే చాలా రకాలుగా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక వైపు ఫ్యామిలీ మరోవైపు ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరగడం.. ఈ విదంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎదగాల్సి ఉంటుంది. ఈ పోరాటంలో కష్టపడే తత్వంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అయితే బాహుబలి విలన్ ప్రభాకర్ కూడా ఎన్నో కష్టాలను దాటి తెరపైకి వచ్చాడట.

    బాహుబలి కాలకేయ..

    బాహుబలి కాలకేయ..

    ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన బాహుబలి సినిమాలో పార్ట్ 1లో ప్రభాకర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. అంతకుముందు మర్యాద రామన్న సినిమాలో అద్భుతమైన పాత్రతో మెప్పించిన ప్రభాకర్ ఆ తరువాత బహుబలిలో చేసిన కాలకేయ పాత్ర కూడా క్లిక్కయింది.

    భయంకర విలన్..

    భయంకర విలన్..

    బాహుబలి సినిమాలో కాలకేయ పాత్రలో కనిపించిన ప్రభాకర్ ఒక్కసారిగా ఇండస్ట్రీ ప్రముఖులను ఆకర్షించాడు. మన టాలీవుడ్ లో కూడా భయంకరమైన విలన్లు ఉన్నారని ప్రముఖ దర్శకులు కామెంట్ చేశారు. ఆ సినిమా తరువాత ప్రభాకర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అవకాశాలతో చాలా బిజీ అయ్యాడు.

    మోసపోయాను..

    మోసపోయాను..

    ఒక ఇంటర్వ్యూలో ప్రభాకర్ తన కష్టాల గురించి వివరించాడు.. రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి చెప్పడంతో సొంత ప్రాంతం మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక మోసపోయాను. ఆ తరువాత బ్రతకడానికి చాలా పనులు చేశాను. కూలి పనులు కూడా చేశాను. అతిధి సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లగా దర్శకుడు చూసి చిన్న పాత్ర చేయించారు.

    Recommended Video

    Who Is Miheeka Bajaj ? Here Is Some Details Of Rana Daggubati's Lover
     రాజమౌళి గారి వల్లే అప్పులు తీర్చాను..

    రాజమౌళి గారి వల్లే అప్పులు తీర్చాను..

    మొదటిసారి మర్యాద రామన్న సినిమాకు సెలెక్ట్ అయినప్పుడు డైలాగ్ చెప్పడం కూడా రాదు. రాజమౌళి గారు ఖర్చులకు డబ్బులు ఇచ్చి మరి యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించారు. ఆ సినిమా తరువాత మంచి రెమ్యునరేషన్ ఇవ్వడంతో నా అప్పులు మొత్తం తీర్చేశాను అని ప్రభాకర వివరణ ఇచ్చాడు. ఒక్క నిమిషం ఆలోచిస్తే.. రాజమౌళి గారు నన్ను గుర్తించకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని కూడా ఈ విలన్ తెలియజేశాడు.

    English summary
    Recognition as an actor in the film industry means that you have to face many difficulties. Family on the one hand is turning to opportunities in the industry. This struggle must be accompanied by a hard-working philosophy. However, Baahubali's villain Prabhakar too has been through many hardships.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X