»   » ప్రభాస్ 'బాహుబలి' లేటెస్ట్ ఇన్ఫో...

ప్రభాస్ 'బాహుబలి' లేటెస్ట్ ఇన్ఫో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి' అందరి నోటా... ఇదే మాట.ఎలా ఉంటాడు?ఎప్పుడొస్తాడు?ఎన్ని కోట్లు?ఇద్దరు ప్రభాస్‌లా?అన్నీ ప్రశ్నలే! సమాధానాల కోసం మరో ఏడాది ఆగాలి. ఎందుకంటే 'బాహుబలి' వచ్చేది అప్పుడే కాబట్టి. పూర్తి సినిమా చూసేది అప్పుడే అయినా - 'బాహుబలి' గురించి అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం 'బాహుబలి' కోసం రామోజీ ఫిల్మ్‌సిటీ ఉడ్‌లాండ్‌ ప్రాంతంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా ఉండబోతోంది. ఇప్పటికే నటీనటులకు పూర్తి శిక్షణ ఇచ్చిన రాజమౌళి యుద్ధానికి అందరినీ సన్నద్ధుల్ని చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజులు సెలవులు తీసుకున్న యూనిట్ మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకి ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు.

Bahubali War Shooting Started

రెండు టీజర్లు ఇప్పటికే ఈ సినిమా 'రుచి' ఏమిటో చూచాయిగా చూపించాయి. తెర వెనుక ఎంత కష్టపడుతున్నారో వాటిని చూస్తుంటే అర్థమవుతూనే ఉంది. అందరి కష్టం ఒక ఎత్తయితే, ప్రభాస్‌ కష్టం మరో ఎత్తు. ఈ సినిమా కోసం బరువు పెరిగాడు. 'బాహుబలి' టైటిల్‌కి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి కఠోరశ్రమ చేశాడు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలూ నేర్చుకొన్నాడు. రెండేళ్లపాటు కొత్తకథలేం వినకూడదని నిర్ణయించుకొన్నాడు. బహు కష్టజీవి అనిపించుకొన్నాడు.

ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

English summary
The 2000 Men War Sequence of Baahubali movie was started in RFC in Hydrbad and the Sequence was handled by Pete Heins and already the Practice work was completed long back with artistics .
 Movie was direction and under the heavy care of SS.Rajamouli and Produced by Arkon Media works.Movie New starred was Thamanna and she was appearing as 'Avantiki' queen. Music composed by MM.Keeravani .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu