»   » వివాదస్పద సాంగ్ ...మేకింగ్‌ ఇదిగో (వీడియో)

వివాదస్పద సాంగ్ ...మేకింగ్‌ ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. ఈ చిత్రంలోని 'పింగ' అనే పాట విడుదలై చాలా వివాదమైంది.

ఇప్పుడీ సాంగ్ మేకింగ్ ని చిత్ర నిర్మాణ సంస్థ ఇరోస్‌ నౌవ్‌ ప్రతినిధులు విడుదల చేసారు. వీడియో లింక్‌ ఇక్కడ.... సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పింగా వివాదం విషయానికి వస్తే..

సంజయ్‌ లీలాబన్సాలీ ప్రతిష్టాత్మక సినిమా ''బాజీరావు మస్తానీ'' డిసెంబరు 18న విడుదల కానుంది. ఇందులో సిద్ధార్థ్‌- గరిమ రచించిన ''పింగా గా పోరీ.. మాలా పింగ్యానీ మల్లా భోలావాలి రాత్‌'' అనే మరాఠీ పాట ఒకటుంది. దర్శకుడు సంజయ్‌ లీలాబన్సాలీ ఈ పాటకు స్వరాలు కూర్చగా శ్రేయఘోషాల్‌, వైశాలి మదే పాటను ఆలపించారు.

ఈ మరాఠీ సంప్రదాయ ''లవనీ'' పాట వీడియో కూడా విడుదల చేశారు. సినిమాలో ఈ పాటకు చాలా ప్రాధాన్యముంది. గతంలో ''దేవదాసు'' సినిమాలో శ్రేయా ఘోషాల్‌ పాడగా ఐశ్వర్యరాయ్‌, మాధురీ దీక్షిత్‌ నర్తించిన ''డోలా రే డోలా హాయ్‌ డోలా దిల్‌ డోలా'' పాటలాగే దీన్ని కూడా ప్రత్యేకంగా చిత్రీకరించారు.

వీడియోలో ఈ పాటను చూశాక కూర్పు, దుస్తులు వాడిన తీరు, చిత్రీకరణ విషయంలో వివాదం రేగింది. బాజీరావు పేష్వా వారసురాలు మోహినీ కర్కరే ఈ విషయం మీద సంజయ్‌ లీలాబన్సాలీకి ఒక ఘాటైన ఉత్తరం రాసింది. కాశీబాయి కీళ్లవాతంతో బాధపడుతూ ఉండేదని, అటువంటి కాశీబాయి నాట్యం ఎలా చేయగలిగింది అంటూ ప్రశ్నలు సంధించింది.

Bajirao Mastani 'S Pinga Song Making

మస్తానీ పడుపుగత్తె కాదు... ఆమె బుందేల్‌ఖండ్‌కు చెందిన రాజా ఛత్రసాల్‌ కుమార్తె అని కూడా ఆ ఉత్తరంలో పేర్కొంది. చరిత్రకు వక్రభాష్యం చెప్పడం క్షమించరాని నేరంగా మోహిని తన ఉత్తరంలో పేర్కొంది.

ఈ విషయం గురించి దీపికా పదుకొనే స్పందిస్తూ ''నేను కూడా ఈ వివాదం గురించి విన్నాను. కానీ నాకు చరిత్ర గురించి తెలియదు. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సింది సంజయ్‌ లీలాబన్సాలీనే'' అని చెప్పింది. ఈ సంప్రదాయ పాటలో నర్తకీమణులు కొన్ని కిలోల బరువున్న దుస్తులు ధరించి ''ఘుంఘరూ'' పద్ధతిలో నర్తిస్తారు. ఈ సినిమాలో పాటకు నర్తించిన విధానం సరికాదు అని మరాఠీ డ్యాన్సర్లు కూడా తప్పు పట్టారు.

English summary
Watch priyankachopra & deepikapadukone dance their way to perfection in the electrifying making of #Pinga!
Please Wait while comments are loading...