»   » భజరంగీ భాయిజాన్ దర్శకుడి పై పాకిస్థాన్ లో దాడి

భజరంగీ భాయిజాన్ దర్శకుడి పై పాకిస్థాన్ లో దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ కు పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్ వెళ్లేందుకు బుధవారం కరాచీ ఎయిర్ పోర్టుకు వచ్చిన 'బజరంగీ భాయిజాన్' దర్శకుడికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళన నిర్వహించారు. భారత్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు. ముంబై అటాక్స్ బ్యాక్ గ్రౌండ్ గా స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఫాంటమ్ పాకిస్థాన్ లో తీవ్ర ప్రకంపనలనే కలిగించింది.

Kabirkhan

బాలీవుడ్ చోటా నవాబ్ సైఫ్ అలీ ఖాన్ హీరోగా ముంబై దాడుల బ్యాక్ డ్రాప్ లో ఫాంటమ్ మూవీని తెరకెక్కించాడు ఖాన్ తాజాగా ముంబై దాడుల సూత్రదారి హఫిజ్ సయ్యిద్ ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు.''ట్రైలర్ లోనే ఈ విషయం బైటపడింది. ఇది నా మనుగడకే ప్రమాదం తెస్తుంది. పాక్ ప్రజల దృష్టిలో నేరస్తుడిని చేస్తుంది ఈ సినిమా. బ్యాన్ చేయండి..'' అంటూ హఫీజ్ పాకిస్తాన్ కోర్టులో పిల్ వేశారు. ప్రస్తుతం కోర్ట్ బ్యాన్ విధించింది. ఈ మూవీలో తన క్యారెక్టర్ ను దోషిగా చూపారని... పాకిస్తాన్ కు వ్యతిరేఖంగా మూవీ ఉందంటూ పిటీషన్ వేశాడు. దీన్ని విచారించిన కోర్టు ఈ మూవీని పాకిస్థాన్ లో విడుదల చేయోద్దంటూ ఉత్తర్వులిచ్చింది.
 Phantom

ఈ నేపథ్యం లో కరాచీలో ఓ సదస్సులో పాల్గొనడానికి కబీర్ ఖాన్ పాకిస్థాన్ కి వెళ్ళారు. కరాచీ ఎయిర్ పొర్ట్ లో ఒక గుంపు ఆయన పై దాడికి ప్రయత్నించింది. ఒక వ్యక్తి బూటు చేత్తో పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ ఖాన్ వెంట పడ్డాడు. పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోందని, దీన్ని సహించబోమంటూ పదేపదే హెచ్చరించాడు.
English summary
Phantom director Kabir Khan had to face the wrath of angry, shoe-wielding protesters at the Karachi airport in Pakistan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu