»   » సల్మాన్ ఖాన్ ‘బజ్రంగి భాయి‌జాన్’ ట్రైలర్ అదిరింది (వీడియో)

సల్మాన్ ఖాన్ ‘బజ్రంగి భాయి‌జాన్’ ట్రైలర్ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు ఆయన తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంజాన్ కానుకగా జులై 17న సినిమా విడుదల కానుంది. తాజా ఈ చిత్రం అపీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి...

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్లో కరీనా కపూర్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇందులో ఆమె రాశిక పాత్రలో నటిస్తోంది. మరో పాత్రధారి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో పాకిస్థాన్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి.

English summary
Bajrangi Bhaijaan features Salman Khan, Kareena Kapoor Khan & Nawazuddin Siddiqui in the lead roles. The film is directed by Kabir Khan and produced by Salman Khan & Rockline Venkatesh and is set to release EID, 2015
Please Wait while comments are loading...