»   » ‘బజ్రంగి భాయిజాన్’... చంపేస్తామంటూ బెదిరింపులు!

‘బజ్రంగి భాయిజాన్’... చంపేస్తామంటూ బెదిరింపులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'బజ్‌రంగీ భాయిజాన్' చిత్రం విషయంలో పాకిస్థాన్ సెన్సార్ బోర్డు చైర్మన్ ఫకర్ ఏ ఆలమ్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రజలను కించపరిచేలా చిత్రంలో వ్యంగ్యమైన యాసను ఉపయోగించారని, కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలాంటి సెన్సార్ చేయక పోవడంపై ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని విడుదలకు అనుమతించడంతో తనను దేశద్రోహిగా ముద్రవేస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. ఒకవేళ తాను ద్రోహినైతే ఈ సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా తన దృష్టిలో ద్రోహియేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శలతో సంబంధం లేకుండా పాక్ థియేటర్లలో బజ్‌రంగీ భాయిజాన్ చిత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది.

'Bajrangi Bhaijaan' spells trouble for Pakistan Censor Board

బెదిరింపుల నేపథ్యంలో థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేసారు. మరో వైపు ఈ చిత్రం పాక్ లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అక్కడ ఇది వంద కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉందని అంటున్నారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా అభిమానులను అలరిస్తున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు కథ అందించింది ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.

English summary
'Bajrangi Bhaijaan' spells trouble for Pakistan Censor Board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu