twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్ వివాదంపై పెదవి విప్పిన బాలయ్య.. తాడో పేడో తేల్చుకొందామనుకొన్నా..

    |

    ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్టు ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న రిలీజ్‌ కానున్నది. విడుదలను పురస్కరించుకొని భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు. బాలకృష్ణ నిమ్మకూరు, విజయవాడ, బెంగళూరు, తిరుపతిలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నారు. ఈ సినిమా గురించి బాలయ్య ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అదేమిటంటే..

     తేజ అవుట్.. క్రిష్ ఇన్

    తేజ అవుట్.. క్రిష్ ఇన్

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ముందుగా తేజ దర్శకుడు. ఆయన చేతుల మీదుగానే సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు తేజ అనూహ్యంగా తప్పుకోవడం వెంటనే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రంగంలోకి దిగడం జరిగిపోయింది. క్రిష్ రాకతో సినిమా పరుగులు పెట్టింది. అయితే దర్శకుడి మార్పు గురించి బాలయ్య తొలిసారి పెదవి విప్పారు.

    దర్శకుడు తేజనే స్వచ్ఛందంగా

    దర్శకుడు తేజనే స్వచ్ఛందంగా

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్ట్ నుంచి తేజ స్వచ్ఛందంగా తొలిగిపోయారు. సినిమా ప్రాజెక్ట్ భారీగా ఉండటం, అంచనాలు పెరిగిపోతుండటంతో ఆయన తప్పుకొంటానని చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని అంగీకరించడం తప్ప మరోటి చేసేది లేకపోయింది అని బాలకృష్ణ అన్నారు. ఆ తర్వాతే క్రిష్‌ను సంప్రదించామని పేర్కొన్నారు.

    క్రిష్ జాగర్లమూడి రాకతో

    క్రిష్ జాగర్లమూడి రాకతో

    క్రిష్ జాగర్లమూడిని సంప్రదించగానే తాను సిద్ధమే అని చెప్పారు. అప్పుడు మణికర్ణిక సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. తేజ తప్పుకొన్నారనే వార్త తెలిసి క్రిష్ వచ్చి నేను డైరెక్ట్ చేస్తానని అన్నారు. రెండు నిమిషాలు ఆలోచించి నేను ఒకే అన్నారు. దాంతో మణికర్ణిక సినిమా నుంచి తప్పుకొని ఎన్టీఆర్ బయోపిక్‌ను భుజానకెత్తుకొన్నాడు అని బాలయ్య తెలిపారు.

    క్రిష్ లేకుంటే నేనే డైరెక్ట్ చేద్దామని

    క్రిష్ లేకుంటే నేనే డైరెక్ట్ చేద్దామని

    ఒకవేళ క్రిష్ లేకుంటే నేను డైరెక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. అలాంటి అవకాశం రాకుండా క్రిష్ సానుకూలంగా స్పందించారు. కే రాఘవేంద్రరావు, బీ గోపాల్‌ గురించి నేను ఆలోచించలేదు. తేజ తర్వాత నేనే డైరెక్ట్ చేద్దామనే ఆలోచనలతో ఉన్నాను. మరొకరి గురించి ఆలోచించలేదు అని బాలకృష్ణ పేర్కొన్నారు.

    English summary
    NTR's 100 busts in theatres across Telugu states to mark NTR Kathanayakudu release. Nandamuri Balakrishna has planned to place 100 busts of his late father, legendary actor NTR aka NT Rama Rao, in 100 cinema halls across the Telugu states to mark the release of NTR Kathanayakudu. Balaiah said that In case if Krish hasn't come aboard, I would have directed the film myself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X