For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలా 'పరదేశి' విడుదల తేదీ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : బాలా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పరదేశి' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మురళి కుమారుడు అధర్వ హీరోగా చేస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్రానికి మునుపు 1930 ప్రాంతంలో చోటుచేసుకున్న అంశాలతో రూపొందించారు. వలస కార్మికులు, బానిస జీవితాలతో అల్లుకున్న కథ ఇది. 'వాడూ వీడూ' పరాజయంతో డీలాపడిన బాలా ఈ చిత్రంపై అంచనాలు పెంచుకున్నారు. నిన్నటి వరకు విడుదలపై పలు రకాల తేదీలు ప్రస్తావనకు వచ్చాయి. 15న థియేటర్లలోకి తెస్తున్నట్లు బాలా అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అనువాద పనులు మొదలైనట్టు సమాచారం. మరోవైపు హిందీలో విడుదలకు కూడా ప్రముఖ నిర్మాత సిద్ధమయ్యారు.

  సహజశైలిలో సాగే బాలా చిత్రాలకు తెలుగులో ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ ఏర్పడింది. అందుకే ఆయన చిత్రాలు మన దగ్గర క్రమం తప్పకుండా విడుదలవుతుంటాయి. ప్రస్తుతం తమిళంలో అధర్వతో బాలా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. అది 'పరదేశి' పేరుతో తెలుగులోకి రానుంది. వాస్తవానికి ఆ కథానాయకుడి పేరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. బాలా పేరుతోనే ఆ చిత్రం మనల్ని పలకరిస్తుందన్న మాట.

  అధర్వ హీరో. వేదిక, ధన్షిక హీరోయిన్స్. ఉమా రియాజ్‌ఖాన్‌ కీలక పాత్రధారి. జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రంతో బాలా నిర్మాతగా కూడా కొత్త అవతారమెత్తాడు. ఆడియో విడుదలైన నవంబరు 25నే ట్రైలర్‌ను కూడా యూట్యూబ్‌లో పెట్టారు. ప్రస్తుతం అది సంచలనం సృష్టిస్తోంది. అధర్వ వేషధారణ, బాలా రూపొందించిన తీరుకు విశేష స్పందన లభిస్తోంది. తొలి మూడురోజుల్లోనే 5 లక్షల మంది వీక్షించారు.

  రెడ్ టీ అనే నవలనే పరదేశీగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం ప్రస్దావిస్తే... ఆ నవలలోని ప్రధానాంశాన్ని మాత్రం తీసుకుని అందులో పరదేశి చేర్చి రూపొందిస్తున్నాను. వంద చిత్రాలతో పొందే అంతస్తును అధర్వ మూడవ చిత్రంతో పొందగలడని భావిస్తున్నాను. ఇందులో మీరు ఊహించని అంశాలే ఉంటా యి. నేను మినహా ఈ చిత్రంలో ఇంచుమించు అందరూ కొత్తవారే. కెమెరామెన్ సెళియన్ నుంచి ఎడిటర్ కిషోర్ వరకు అందరూ నూతన సాంకేతిక వర్గమే అన్నారు.

  దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్‌ కాదవుల్‌' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్‌ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్‌ కాదవుల్‌' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. పరదేశి చిత్రం రియల్ లైప్ ఇన్సిడెంట్స్ తో 1930నాటి కథతో జరుగుతోంది. అధర్వ మురళి హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం సాలూర్, మన్నముదురై, మున్నారు, తలైవార్ వంటి ప్రదేశాలల్లో షూటింగ్ జరిగింది. అక్కడ అటవీ ప్రాంతాలు, కేరళ లేని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ చేసారు.

  English summary
  Bala's much-awaited Paradesi will finally be hitting screens on March 15! The film features Atharva, Dhansika and Vedhika in the lead roles. The film is touted to take Atharva a notch higher in the industry. The story of the film is based on real life incidents that took place before independence in the 1930s and is inspired from the novel Red Tea, written by Paul Harris Daniel. Paradesi has come out clean from the censors with a 'U' certificate. Music has been composed by GV Prakash and lyrics penned by Vairamuthu, who is associating with Bala for the first time. Paradesi has been produced by Bala himself under B Studios.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X